ఓహో .. బీజేపీకి ఏపీలో ఊపు తగ్గడానికి కారణం ఇదా ? 

కేంద్ర అధికార పార్టీగా ఒక వైపు బీజేపీ హవా దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నా, ఏపీలో మాత్రం ఆ ప్రభావం ఎక్కడ కనిపించడం లేదు.చెప్పుకోవడానికి గొప్ప గొప్ప నాయకులు బీజేపీ లో ఉన్నా, పార్టీ మాత్రం క్షేత్రస్థాయిలో బలం పెంచుకోలేకపోతోంది.ఎవరు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలల పాటు హడావుడి చేయడం, కొంతకాలం పాటు పెద్ద ఎత్తున వలసలు ఉండేలా గట్టి ప్రయత్నాలు చేయడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం వంటి పరిణామాలు తరచుగా ఏపీ బీజేపీ లో కనిపించే దృశ్యాలు.2019 ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా బీజేపీ దక్కించుకోలేకపోయింది.అంటే బీజేపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతోంది.ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం అయిన తర్వాత పార్టీకి కాస్త ఊపు వచ్చినట్లుగా కనిపించినా, ఆ తర్వాత మళ్లీ మొదటికే పరిస్థితి వచ్చిపడింది.

 No One Has Come To Join Ap Bjp Due To Somu Veerrajus Attitude Ap Bjp, Somu Veera-TeluguStop.com

సోము వీర్రాజు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన బీజేపీ అధిష్టానం ఆయనపై నమ్మకం పెట్టుకుంది .ఎలాగూ జనసేన సహకారం ఉంటుంది కాబట్టి, పార్టీ అధికారం లోకి వచ్చే అంత స్థాయిలో బలం పుంజుకుంటుంది అనే నమ్మకంతో అంతా సైలెంట్ గా ఉంటూ వచ్చారు.అయితే ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నిక తో పాటు, స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు.అలాగే సోము వీర్రాజు సైతం చాలా సైలెంట్ అయిపోయారు.

అప్పుడప్పుడు మాత్రమే ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఎక్కువగా సైలెంట్ గా ఉండిపోతున్నారు.

Telugu Amithsha, Ap Bjp, Jagan, Modhi, Somu Veeraju, Sujana Chowdary, Ysrcp-Telu

వాస్తవంగా టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చేందుకు చాలా మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నా, వీర్రాజు వైఖరి కారణంగానూ, అలాగే బీజేపీలో నెలకొన్న గ్రూప్ రాజకీయాలతో తాము రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వలస వద్దామనుకున్న వారంతా సైలెంట్ అయ్యారట.ప్రస్తుత పరిణామాలు అన్నిటికీ వీర్రాజును బాధ్యుడిగా చేస్తూ, అధిష్టానానికి ఫిర్యాదులు సైతం వెళుతుండటం తదితర కారణాలతో వీర్రాజు సైలెంట్ గానే ఉంటున్నారట.ఇలా ఎన్నో రకాల కారణాలతో ఏపీ బీజేపీ పూర్తిగా నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube