SV Rangarao: అప్పటికి ఎప్పటికి అయన ఒక్కడే లెజెండ్..కాదంటే నమ్ముతారా ?

సినిమా ఇండస్ట్రీ కి లెజెండ్ నటులు ఎందరు వచ్చిన మెథడ్ యాక్టింగ్ చేయగల ఒకే ఒక నటుడు సామర్ల వెంకర రంగ రావు అలియాస్ SVR. తెలుగు ఒక్కటే కాదు భారతీయ చిత్ర రంగానికే మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటో నేర్పిన ఆద్యుడు కూడా అతడే.కానీ చాల మందికి ఈ మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు.ఇప్పుడు అంటే నటన నేర్పడానికి అనేక ఇన్స్టిట్యూట్స్ పుట్టుకచ్చాయి కానీ పుట్టుకతోనే నటన అంటే ఏంటో నేర్పిన గొప్ప వ్యక్తి ఎస్వీఆర్.

 No One Can Replace Sv Rangarao Details, Svr, Sv Rangarao, Legend Actor Sv Rangar-TeluguStop.com

పాతాళ భైరవి సినిమాలో నేపాల మాంత్రికుడిగా ఆయన్ను తప్ప మరెవరినైనా ఊహించుకోవగలమా ? అయన లేకుంటే ఆ సినిమా గురించి మాట్లాడేవారు ఎవరు ఉంటారు చెప్పండి.

ఇక ఘటోత్కచుడు సినిమా లో ఎస్వీఆర్ లేకుండా ఆ సినిమా ఉండగలదా ? అయన లేకుండా సినిమా లేనట్టే సినిమా లేకపోతే మనం ఈ రోజు అయన గురించి తలచుకోగలమా.1964 లో జకార్తా లో జరిగిన ఏషియన్ సినిమా ఫెస్టివల్ లో నర్తన శాల సినిమా ప్రసారం చేస్తే బెస్ట్ యాక్టర్ గా ఎస్వీఆర్ కి అవార్డు దక్కింది.ఈ సినిమాలో అయన లేకుండా అంత పెద్ద హిట్ అయ్యేదా ? జకార్తాలో అయన నటన చుసిన హాలీవుడ్ వారు కూడా నోరెళ్ళ బెట్టారు.ఇలాంటి ఒక గొప్ప నటుడు అమెరికా లాంటి దేశంలో పుట్టి ఉంటె ఖచ్చితం గా ఆస్కార్ వచ్చేది.

Telugu Ghatothkachudu, Narthanashala, Patala Bhairavi, Sv Rangarao-Movie

ఆ సినిమాలో గుక్క తిప్పుకోకుండా అయన చెప్పినాన్ డైలాగ్స్ ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో చూసి అక్కడ వారంతా చప్పట్లు కొట్టారట.ఇక బయట ఎవరో ఎదో అవార్డులు ఇస్తున్న మన ప్రభుత్వాలకు ఎలాంటి అవార్డు ఇవ్వాలని ఎందుకు అనిపించలేదు ఇప్పటికి అర్ధం కాదు.ఆయనకు ఒక పద్మశ్రీ, పద్మ భూషణ్ దక్కకపోవడం నిజంగా బాధాకరం.

అయినా కూడా అయన జనాల మనసుల్లో సంపాదించుకున్న స్థానం ముందు ఈ పద్మాలు ఏమంత గొప్పవి చెప్పండి.ఇక అవార్డుల కోసం వెంపర్లాడే వ్యక్తి కాదు కాబట్టే ప్రభుత్వం ఆయన్ని గుర్తు పెట్టుకోలేదు.

అయన లాంటి ఒక లెజెండ్ నటుడు ఇండియా మొత్తం మీద ఎంత వెతికిన కూడా దొరకరు.ఆయన పోయిన తర్వాత అలాంటి ఒక నటుడు పుట్టలేదు కూడా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube