భారతీయ సినీ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ గురించి అందరికీ తెలిసిందే.ఈయన అటు సినీ రంగం ఇటు రాజకీయ రంగంలో రెండు వైపులా సరిసమాన బాధ్యతలను మోస్తున్నాడు.
ఈయనకు సినీ నటుడు గానే కాకుండా రాజకీయపరంగా ఎంతగానో అభిమానం ఉంది.ఇక కమల్ హాసన్ ప్రస్తుతం మూడో కూటమి ఏర్పాటు గురించి గట్టిగానే వాదిస్తున్నాడు.
మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్ తన నేతృత్వంలో మూడో కూటమి గురించి చాలా గట్టి నమ్మకాన్ని తెలియజేస్తున్నాడు.ఈ కూటమి కి సంబంధించిన విషయాల గురించి ఎస్ఎంకే, ఐజేకేలతో చేతిలో కలుపగా వారితో పొత్తు ఇంకా స్పష్టం కాలేదని తెలిపారు.
ఈ విషయం గురించి చర్చ జరుగుతుండగా కమల్ హాసన్ మహిళలు, యువత, క్రీడాకారులు ప్రోత్సహించే విధానంలో ఏడు వాగ్దానాలు చేశాడు.
అందులో వారితో పొత్తుల విషయంలో స్పష్టం కాలేదంటూ వీటి గురించి చర్చలు సాగాల్సి ఉందని తెలిపారు.అంతేకాకుండా తన కూటమిలోకి మంచి వాళ్ళు వస్తే చేర్చుకోవడానికి సిద్ధమంటూ రావాలనుకునే వాళ్ళు త్వరగా రావాలని తెలుపుతున్నాడు.ఇక ఇటీవల వెన్నంటి పొన్ రాజ్ లక్ష ఇండియాను తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఈయన కమల్ హాసన్ కూటమిలో చేరడంతో ఈయనకు కమల్ హాసన్ పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతను అప్పగించాడు.
ఇక మైలాపూర్ లో జరిగిన ఎన్నికల గురించి కమల్ హాసన్ మాట్లాడుతూ నీతి కి వ్యతిరేకంగా ఉన్న వాటిపైనే తన యుద్ధం అంటూ, అవినీతి పాలకొల్లు తరిమికొట్టడం తన లక్ష్యమని, తమలో మార్పును కోరుకుంటున్న ప్రజలకు వారికి మంచి పరిపాలన అందించాలనే ఆశతో మరింత ముందుకు వెళ్తున్నట్లు తెలిపాడు.
ఇక ఆయనను కొనేందుకు ఇదివరకు చాలా ప్రయత్నాలు జరిగాయని, 100 కోట్లు ఇస్తామన్నా తగ్గేది లేదంటూ గట్టిగా తెలిపాడు.
ఈ డైలాగును తన సినిమాలో ముందే చెప్పినట్లుగా గుర్తు చేశారు.ఆయనను ఎవరు కొనలేరని, ఆయనకు ఏడున్నర కోట్ల తమిళ ప్రజలు ఉన్నారని ఆ ప్రజలపై ఉన్న భారాన్ని తీర్చడమే తన లక్ష్యమని తెలిపాడు.