హీరోయిన్లు అందంగా ఉండాలి.ఉంటారు కూడా.
తమ అందాన్ని కాపాడుకునేందుకు వారు రకరకాల ప్రయత్నాలు చేస్తారు.కొందరు జిమ్ లో వర్కౌట్లు చేస్తే మరికొందరు యోగాసనాలు వేస్తారు.
వీటితో పాటు పలు రకాల జాగ్రత్తలు పాటిస్తారు.అందుకే వాళ్లు ఫిట్ గా కనిపిస్తారు.
అటు కొంతమంది టాలీవుడ్ భామలు పెళ్ళైనప్పటికీ టీనేజ్ అమ్మాయిళ్లా కనిపిస్తున్నారు.వీళ్లకు పెళ్లయింది అని ఎవరైనా అంటే నిజమా అంటూ అశ్చర్యపోతున్నారు.
ఎందుకంటే వీళ్లు సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడమే కారణం.ఇంతకీ పెళ్లైన ఆ బ్యూటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
అదితి రావు హైదరి
మణిరత్నం మూవీ చెలియాతో తెలుగు జనాలకు తెలిసింది అదితి.ఆ తర్వాత పలు సినిమాల్లో చేసింది.ఈమె సత్యదీప్ మిశ్రాను 2009లో వివాహం చేసుకుందన్నది.2013లో వీళ్ళు విడిపోయారు.
ఆకాంక్ష సింగ్
గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన మళ్ళీ రావా మూవీతో ఈమె హీరోయిన్ గా పరిచయమైంది.ఆ తరువాత పలు సినిమాలు చేసింది.ఈమెకు కునాల్ సైన్ అనే సీరియల్ యాక్టర్ తో 2012 లో పెళ్ళైంది.
నజ్రియా
రాజా రాణి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నజ్రియా.హీరో ఫహాద్ ఫాజిల్ తో 2014 లో మ్యారేజ్ అయ్యింది.ఇతడు పుష్ప మూవీతో విలన్ గా రాబోతున్నాడు.
రాధికా ఆప్టే
రక్త చరిత్ర, లెజెండ్, లయన్ సహా పలు సినిమాల్లో నటించి ఈ బోల్డ్ బ్యూటీ.బెనెడిక్ట్ టేలర్ అనే వ్యక్తితో డేటింగ్ చేసి 2013లో మ్యారేజ్ చేసుకుంది.
హిమజ
సీరియల్స్ లో హీరోయిన్ గా నటించిన హిమజ.ఆ తర్వాత తరువాత నేను శైలజ, శతమానం భవతి సహా పలు సినిమాల్లో చేసింది.2012లో రాజేష్ ఆనందన్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది.
సనా ఖాన్
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన కత్తి సినిమాతో ఈమె తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది.ఆ తర్వాత పలు సినిమాలు చేసింది.ఈమె గతేడాది సయ్యద్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది.
షాలినీ వడ్నికట్టి
కృష్ణ అండ్ హిజ్ లీల, భానుమతి అండ్ రామకృష్ణ సహా అనేక సినిమాలు చేసిన ఈమె గతేడాది.డైరెక్టర్ మనోజ్ బీదను పెళ్లి చేసుకుంది.
నీతి టేలర్
మేం వయసుకు వచ్చాం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈమె.గతేడాది పరీక్షిత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.
మమతా మోహన్ దాస్
యమదొంగ, విక్టరీ, చింతకాయల రవి సహా పలు సినిమాలు చేసిన పరాజిత్ పద్మనాభన్ అనే వ్యక్తిని 2011లో పెళ్లి చేసుకుంది.2012లో వీరు విడిపోయారు.
అనీషా అంబ్రోస్
అలియాస్ జానకి, గోపాల గోపాలతో పాటు పలు సినిమాలు చేసిన ఈమె గుణనాథ్ జక్కా అనే వ్యక్తిని 2019లో పెళ్లి చేసుకుంది.