బ్లాక్‌బస్టర్ కొట్టినా పట్టించుకోరే..?

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించాలంటే అందం, అభినయంతో పాటు అందరినీ మెప్పించే ట్యాలెంట్ ఖచ్చితంగా ఉండాలి.కానీ కొంతమందికి అన్నీ ఉన్నా అదృష్టం లేకపోవడంతో వారు హీరోయిన్‌గా రాణించలేకపోతున్నారు.

 No Offers For Niddhi Aggarwal After Blockbuster-TeluguStop.com

వీరిలో చాలా మంది హీరోయిన్లు ఆఫర్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ఈ జాబితాలోనే చేరింది అందాల భామ నిధి అగర్వాల్.

టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించినా కూడా తగిన గుర్తింపు రాలేదు ఈ బ్యూటీకి.అయితే గతేడాది రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్‌‌ సినిమాతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకుంది ఈ బ్యూటీ.

అందంతో పాటు అభినయంతోనూ ఈ సినిమాలో అమ్మడికి మంచి గుర్తింపు లభించింది.కానీ అదృష్టం మాత్రం ఆమె తలుపు తట్టలేదు.దీంతో ఆ సినిమా తరువాత వరుసగా ఆఫర్లు వచ్చి పడతాయని ఆశించిన నిధికి నిరాశే మిగిలింది.

ఇస్మార్ట్ శంకర్ తరువాత నిధికి ఒక్క చిన్న సినిమా మినహా చెప్పుకోదగ్గ ఆఫర్లు ఏమీ రాలేదు.

గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్న సినిమా మినహా నిధి చేతిలో మరో ఆఫర్ లేదట.ఆమెను టాలీవుడ్ దర్శకనిర్మాతలు అసలు పట్టించుకోవడం లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరి ఈ బ్యూటీకి అదిరిపోయే ఆఫర్లు వస్తాయా లేక ఇలానే కాలం నెట్టుకొస్తుందా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube