అక్కడ ఇకపై నో నాన్ వెజ్.. ఎందుకంటే?

కరోనా వైరస్ కారణంగా మనిషి జీవితంలో అన్ని మార్పులు వచ్చాయి.ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 Non Veg Bundh, 10 Days, Telangana, Atmakur-TeluguStop.com

మాస్కు, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ అన్ని పాటిస్తున్నారు.అయినా సరే కరోనా వైరస్ దారుణంగా వ్యాపిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజుకు వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.ఇంకా ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని ఆత్మకూరు కలెక్టర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

ఆ నిర్ణయం మాంస ప్రియులకు కాస్త బాధ కలిగించినప్పటికి అయన తప్పక తీసుకున్నాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఈ నెల 15 నుంచి 24 వరకు మటన్‌, చికెన్‌, చేపలు ఏవి విక్రయించకూడదని బంద్ చెయ్యాలని చెప్పారు.ఈ మేరకు పదిరోజుల పాటు మాంసం విక్రయాలు బంద్‌ అని ఎంపీడీవో ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ ప్రకటనలో తెలిపారు.

దేశవ్యాప్తంగా ఈ పదిరోజులు పవిత్ర పర్యూషన్‌ పర్వదినాలను పాటించనున్నట్టు అందుకే దేశం మొత్తం మాంసం విక్రయాలు నిలిచిపోనున్నట్టు వారు పేర్కొన్నారు.గ్రామాల్లో మాంసం విక్రయదారులు కూడా ఇందుకు సహకరించాలని కోరగా ఎక్కడైనా సరే మాంసం విక్రయాలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ముందే తెలిపారు.

ఇందుకు ప్రజలు కూడా స్వచ్చందంగా సాహికరించాలని వారు కోరారు.కాగా దేశవ్యాప్తంగా ఈ ప్రకటన ఇంకా రాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube