భారత్ నుంచీ విదేశాలకు ఎంతో మంది భారతీయులు వలసలు వెళ్తూ ఉంటారు, అలా వలసలు వెళ్ళిన వారు ఆర్ధికంగా స్థిరపడిన తరువాత తమ సొంత ప్రాంతాలలో భూముల కొనుగులో లేదా, వ్యాపార రంగంలో పెట్టుబడులు చేపడుతూ ఉంటారు.అయితే ఈ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ సమయంలో ఎన్నారైలు రిజిస్ట్రేషన్ కంటే ముందుగానే పూర్తిగా TDS చెల్లింపులు చేయాల్సి వచ్చేది.
దాంతో ఎన్నారైలు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కునే వారు.ఈ విషయంపై నిపుణుల సూచనల మేరకు కేంద్రం ఎన్నారైలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.
ఎన్నారైల కు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేసులుబాటులు కలిగించడం కొత్తేమి కాదు.గతంలో
ఎన్నారైలకు ఆధార్ జారీ విషయంలో సుమారు 6 నెలల సమయం వేచి ఉండాల్సి వచ్చేంది కానీ కొన్ని రోజుల క్రితమే కేంద్రం సడలించిన నిభంధనల ప్రకారం, ఎన్నారైలు ఆధార్ కార్డ్ కోసం నెలల తరబడి వేచి చూడకుండా త్వరగానే ఇచ్చేలా వెసులుబాటు ఇచ్చింది కేంద్రం.
ఇప్పుడు తాజాగా ఎన్నారైలు భూములు కొనుగోలు రిజిస్ట్రేషన్ TDS చెల్లింపుల సమయంలో ముందస్తుగా TDS చెల్లించాల్సిన అవసరం లేదని రిజిస్ట్రేషన్ అయిన తరువాత నెల రోజుల వ్యవధిలో TDS చెల్లించవచ్చని తెలిపింది.
నిన్నటి వరకూ కూడా ఎన్నారైలు భూముల కొనుగోలు లావాదేవీల విషయంలో TDS ముందుగానే చెల్లించాల్సి వచ్చేది అయితే పవర్ ఆఫ్ అటార్నీ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో మాత్రం ఇది సమస్యగా ఉండేది దాంతో పాటు TDS ముందుగా చెల్లించక పొతే రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు.
దాంతో ఎన్నారైలు ఇబ్బందులు పడుతున్నారన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిభంధననాను సడలించింది.ముందుగా చెల్లింపులు అవసరం లేదని, రిజిస్ట్రేషన్ అయిన తరువాత TDS చెల్లించవచ్చునని తెలిపింది.
ఈ మేరకు భారత్ లోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఆదేశాల సర్క్యులర్ పంపినట్టుగా ప్రకటించింది.అయితే రిజిస్ట్రేషన్ అయిన నెలలో TDS చెల్లించకపోతే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుందని కూడా హెచ్చరించింది.