అపోహలు వద్దు..!  చర్మ సంరక్షణ ప్రతి ఒక్కరికీ అవసరమే

No Myths Skin Care Is Essential For Everyone Skin Care Tips

చర్మ సంరక్షణ ప్రతి ఒక్కరికీ అవసరమే.కానీ తమ చర్మ స్వభావానికి అనువైన స్కిన్ కేర్ ఉత్పత్తులు మాత్రమే వాడాలి.

 No Myths Skin Care Is Essential For Everyone Skin Care Tips-TeluguStop.com

కొందరు చర్మానికి రక్షణ అవసరం అని తెలిసిన రక రకాల అనుమానాలు అపోహలు కారణంగా అక్కడే ఆగిపోతారు అలాంటివాళ్లు తెలుసుకోవలసిన విషయాలు గురించి వివరంగా చెబుతున్నారు కొందరు నిపుణులు… సన్ స్క్రీన్ లోషన్ ఎండాకాలంలో మాత్రమే వాడాలి ఏమో అని అనుకుంటారు చాలా మంది.వర్షాకాలం, చలికాలంలో ఎండా వేడి ఎక్కువగా ఉండవని వారి అభిప్రాయం.

అంతమాత్రాన వాతావరణంలో సూర్యరశ్మి ఉండక పోదు ఏకాలంలోనైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు శరీరానికి సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటే UV కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది.దాంతో చర్మ క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉండదు.

 No Myths Skin Care Is Essential For Everyone Skin Care Tips-అపోహలు వద్దు..  చర్మ సంరక్షణ ప్రతి ఒక్కరికీ అవసరమే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రోజూ మర్దన చేసుకుంటేనే చర్మం సురక్షితంగా ఉంటుందని అనుకుంటారు కొందరు.చర్మ రంధ్రాల్లో నూనె పదార్థాలు తొలగించడానికి ఇది మంచి పద్ధతే.

అలాగని రోజూ చేస్తే చర్మంలోని సహజంగా ఉండాల్సిన నూనెలు పూర్తిగా తొలగిపోయి చర్మం పొడిబారుతుంది.సహజంగానే చర్మం రోజుకు ఒక రోజు మృతకణాలను దూరం చేసుకుంటుంది.కాబట్టి వారానికి ఒకసారి మర్దనా చాలు.మేకప్ వేసుకుంటే చర్మం పాడవుతుంది అన్న అపోహ ఈ రోజుల్లో కూడా ఉంది.

ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ఆర్గానిక్ మేకప్ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి.వాటి వల్ల చర్మానికి ఎలాంటి హాని జరగదు.

అయితే మేకప్ తొలగించకుండా రాత్రంతా నిద్ర పోతే మాత్రం మొటిమలు, ముడతలు మొదలైన సమస్యలు ఎదురవుతాయి.

Telugu Essentialskin, Tips, Moisturizer, Oily Skin, Organic, Pimples, Skin Cancer, Skin Care, Skin Care Tips, Uv Rays-Telugu Health

ఎటూ ఆయిల్ స్కిన్ ఉండటం వల్ల చాలామంది తమకు మాయిశ్చరైజర్ అవసరం లేదని భావిస్తారు.అలాగే క్రీములు రాసుకుంటే మొటిమలు వస్తాయి అన్న భ్రమలో ఉంటారు.జిడ్డు చర్మం ఉన్నవాళ్లు లైట్ వెయిట్ జెల్ బెస్డ్ మాయిశ్చరైజర్లు వాడటం వల్ల చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది.

అలాగే ఖరీదైన ఉత్పత్తులు మాత్రమే మంచి ఫలితాలు ఇస్తాయి అనుకోవడం సరికాదు.ధరలో సంబంధంలేకుండా వాటిలో ఏ పదార్థాలు వాడుతున్నారు అన్నది తనిఖీ చేసుకుంటే సరిపోతుంది.మొదటిసారి ప్రయోగాత్మకంగా కొద్ది మోతాదుల్లో వాడి చూడాలి.

#Skin Cancer #Oily #Organic #Tips #UV Rays

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube