ఈ సీనియర్ హీరోయిన్ ను నిర్మాతలు పట్టించుకోవట్లేదా..?

ఇష్టం సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రెండేళ్ల క్రితం వరకు వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు శ్రియా సరన్.ఒకవైపు సీనియర్ హీరోలతో, మరోవైపు యంగ్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా శ్రియ గుర్తింపును సంపాదించుకున్నారు.

 No Movie Offers For  Star Heroine Shriya Saran, Shriya Saran, Movie Offers, Glam-TeluguStop.com

తెలుగులో దాదాపుగా అందరు స్టార్ హీరోలతో నటించిన శ్రియ తమిళంలో రజనీకాంత్ లాంటి స్టార్ హీరోకు కూడా జోడీగా నటించారు.అందం, అభినయం పుష్కలంగా ఉన్న హీరోయిన్ కావడంతో ఇండస్ట్రీలో ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి.
అయితే గత రెండేళ్ల నుంచి శ్రియకు తెలుగు, తమిళంలో పెద్దగా ఆఫర్లు రావడం లేదు.అవకాశాలు తగ్గిన ప్రతిసారి ఒక బ్లాక్ బస్టర్ హిట్ తో శ్రియ మళ్లీ బిజీ అవుతున్నారు.

అయితే తెలుగులో 2018లో శ్రియ నటించిన వీరభోగ వసంత రాయలు, గాయత్రి సినిమాలు విడుదల కాగా ఆ తరువాత ఆమెకు అవకాశాలు దక్కలేదు.తెలుగులో సీనియర్ హీరోలకు జోడీగా శ్రియకు ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతున్నా అధికారిక ప్రకటనలు మాత్రం వెలువడటం లేదు.

Telugu Gayathri, Offers, Offersshriya, Shriya Saran, Meida, Tollywood-Movie

అయితే శ్రియ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు.ఇతర భాషల్లో శ్రియ చేతిలో కొన్ని ఆఫర్లు ఉన్నా ఆ ఆఫర్లు ఆమె కెరీర్ కు పెద్దగా ఉపయోగపడవనే చెప్పాలి.కురచ దుస్తుల్లో శ్రియ ఫోటోలకు ఫోజులిస్తూ స్టార్ హీరోల సరసన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు.గతేడాది హీరోయిన్ శ్రియకు పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి.
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలైనా శ్రియ హీరోయిన్ అవకాశాల కోసమే వేచి చూస్తుండటం గమనార్హం.మరి 2021 సంవత్సరమైనా శ్రియకు కలిస్తొస్తుందో లేదో చూడాల్సి ఉంది.

గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఈ హీరోయిన్ ను నిర్మాతలు పట్టించుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube