ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వారానికి ఒక రోజు వర్క్ ఫ్రం హోమ్.. కాకపోతే అక్కడ మాత్రమే..!  

ఇప్పటివరకు ప్రవేట్ రంగ ఉద్యోగులకు మాత్రమే వర్క్ ఫ్రొం హోమ్ అవకాశం ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాం.అయితే ఎప్పుడైనా గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి వర్క్ ఫ్రొం హోమ్ చేయడం మీరు చూశారా…? అయితే తాజాగా భారతదేశం లోని హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని మొట్ట మొదటగా వారి ఉద్యోగులకు కల్పిస్తోంది.ఇందుకు సంబంధించి హిమాచల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ఈ కీలక నిర్ణయాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది.

TeluguStop.com - No More Work From Home One Day A Week Even For Government Employees If Not Only There

ఈ విషయం సంబంధించి తాజాగా హిమాచల్ రాష్ట్ర ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్ ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అందులో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి మీడియా పూర్వకంగా మాట్లాడుతూ.

ప్రభుత్వ కార్యాలయాలలో పని దినాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.ఇందులో భాగంగానే ప్రతి వారం రోజులలో కేవలం ఐదు రోజులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పని చేయవచ్చని మరో రోజు ఇంటి దగ్గరే ఉండి వర్క్ ఫ్రొం హోమ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

TeluguStop.com - ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వారానికి ఒక రోజు వర్క్ ఫ్రం హోమ్.. కాకపోతే అక్కడ మాత్రమే..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ నిర్ణయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆఫీసు కూడా వర్తిస్తుందని ఆయన అధికారికంగా ప్రకటన చేశారు.

కోవిడ్ -19 చైన్ బ్రేక్ చేయడానికి ఈ పద్ధతిని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.వీటితో పాటు హిమాచల్ ప్రదేశ్ లోని నగరాలైన కులు, మండి, సిమ్లా, కాంగ్ర నగరాలలో ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు కచ్చితంగా కర్ఫ్యూను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

#Facility #COVID-19 #Government Jobs #Work From Home #Carona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు