ఇకపై అక్కడ మాస్క్​ లేకుండా తిరగొచ్చట..! కాకపోతే..?!

మాస్కులు వాడాలన్నా అంశంపై అమెరికా దేశ ప్రభుత్వం ఓ కీలకమైన విడుదల చేసింది.ఇందుకు సంబంధించి ఆ దేశ వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.

 No More Wandering Around There Without A Mask If Not-TeluguStop.com

ఇందులో భాగంగా కచ్చితంగా కోవిడ్ 19 సంబంధించి రెండు వాక్సినేషన్ లు తీసుకున్న ప్రజలు మాత్రమే మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని అమెరికా దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది.గత కొద్ది నెలల క్రితం అమెరికా సెకండ్ కారణంగా అత్యంత దారుణంగా ప్రభావితమైన ఆ దేశం ప్రస్తుతం సాధారణ పరిస్థితి వైపు పరుగులు పెడుతోంది.

ఇందుకు నిదర్శనంగా ఈ నూతన మార్గదర్శకాలు అర్థం పడుతున్నాయి.ఇకపోతే అమెరికా ఎలాంటి నూతన మార్గదర్శకాలను సూచించింది అంటే.

 No More Wandering Around There Without A Mask If Not-ఇకపై అక్కడ మాస్క్​ లేకుండా తిరగొచ్చట.. కాకపోతే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆస్ట్రాజనక, ఫైజర్, మెడరమా, జాన్సన్ అండ్ జాన్సన్ ఇందులో ఏ కంపెనీకి చెందిన తీసుకున్నవారికి మాత్రమే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని తెలిపింది.పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ పొందకపోయినా అలాగే వ్యాక్సినేషన్ తీసుకోకపోయినా మాస్క్ కచ్చితంగా ధరించాల్సిందే అని తెలిపింది.ఒకవేళ టీకా తీసుకున్న రెండో రోజు అనంతరం రెండు వారాల తర్వాత మాస్కులు తీసేయవచ్చు అని అమెరికా వెల్లడించి.ఒకవేళ దేశంలోని వివిధ రాష్ట్రాలు ఆ రాష్ట్రం సంబంధించిన కొత్త నిబంధన ఏవైనా ఉంటే వాటిని కూడా పాటించాలని తెలుపుతూనే భౌతిక దూరం కూడా అవసరం లేదని తెలియజేసింది.

ముఖ్యంగా ప్రయాణాలకు ముందు, ఆ తర్వాత కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని తెలియజేశారు.ప్రయాణం చేసిన తర్వాత కూడా హోమ్ క్వారంటైన్, క్వారంటైన్ సమయం గడపడం లాంటి అవసరాలు లేదని తెలియజేసింది.

ఈ నియమ నిబంధనలపై తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ హర్షం వ్యక్తం చేశారు.అమెరికన్లకు వాక్సినేషన్ లు శరవేగంగా అందడం వల్లే ఈ మైలురాయిని సాధించామని ఆయన చెప్పుకొచ్చారు.

ఇప్పటివరకు 25 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించామని ఆయన చెప్పుకొచ్చారు.తాజాగా అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ ఇదొక గొప్ప రోజు గొప్ప మైలురాయిని అందుకున్నాం.

టీకా తీసుకున్న ప్రజలు మాస్కులు వేసుకోవాల్సిన అవసరం లేదని, 49 రాష్ట్రాల్లో కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని తెలియజేశాడు.మునపటితో పోలిస్తే 80 శాతం వరకు మరణాల రేటు తగ్గిందని కేవలం 4 నెలల వ్యవధిలో పెద్దలకు వాక్సినేషన్ అందించడంలో భారీ పురోగతి సాధించామని తెలిపారు.

#New Rules #Mask #No Wear #COVID-19 #Carona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు