మద్యం ప్రియులకు ఝలక్.. ఆ మద్యం బ్యాన్..?  

no more scotch India ban imported goods Army Canteens, Imported Scotch, Liquor Price, Army Canteens, India, Modi govt, China apps Banned in India - Telugu Army Canteens, China Apps Banned In India, Imported Scotch, India, Liquor Price, Modi Govt, No More Scotch India Ban Imported Goods Army Canteens

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ మద్యం ప్రియులకు ఝలక్ ఇచ్చింది.ఆర్మీ క్యాంటీన్లలో లభ్యమయ్యే విదేశీ మద్యంపై ఆంక్షలు విధించింది.

TeluguStop.com - No More Scotch India Ban Imported Goods Military Shops

తాజాగా కేంద్రం నుంచి విదేశీ మద్యంపై బ్యాన్ విధిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయని సమాచారం.కొన్ని నెలల క్రితం చైనా భారత్ సరిహద్దు వివాదం నెలకొనగా అప్పటినుంచి మోదీ సర్కార్ భారత్ లో తయారైన ఉత్పత్తులకు ప్రాధాన్యతనిస్తూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది.

ఈ క్రమంలోనే భారత్ చైనా యాప్ లపై నిషేధం విధించింది.దేశంలోని 4,000 ఆర్మీ క్యాంటీన్ లకు కేంద్రం నుంచి ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది.ఇప్పటికే విదేశీ బ్రాండ్లకు సంబంధించి ఆర్మీ క్యాంటీన్ల నుంచి ఆర్డర్లు నిలిపివేయబడ్డాయని.యూకే కంపెనీ డియాజియో, ఫ్రెంచ్ కంపెనీ పెర్నోడ్ రిచర్డ్ లపై కేంద్రం నిర్ణయం ప్రభావం ప్రధానంగా పడనుందని తెలుస్తోంది.

TeluguStop.com - మద్యం ప్రియులకు ఝలక్.. ఆ మద్యం బ్యాన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సంవత్సరానికి దాదాపు 17 మిలియన్ల మేర విదేశీ మద్యం అమ్మకాలు జరగనుండగా ఆర్మీ క్యాంటీన్లలో విదేశీ మద్యం బాటిల్ పై ఉన్న ధరతో పోలిస్తే తక్కువ మొత్తానికే విక్రయిస్తారు.మాజీ సైనికోద్యోగులు, సైనికులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం చిన్నపాటి ఝలక్ అనే చెప్పాలి.

అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.అయితే కేంద్రం నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ విదేశీ పెట్టుబడులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉన్నాయి.ప్రస్తుతం ఆర్మీ క్యాంటీన్ లలో 10 శాతం లోపే విదేశీ ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

అయితే కేంద్రం ఇతర విదేశీ ఉత్పత్తులపై కూడా బ్యాన్ విధిస్తుందా.? చూడాల్సి ఉంది.ప్రస్తుతం దేశంలోని స్టోర్లలో బ్యాన్ విధించిన మద్యం స్టాక్ పరిమితంగానే ఉందని సమాచారం.భవిష్యత్తులో మరిన్ని విదేశీ ఉత్పత్తులపై కేంద్రం ఆంక్షలు విధించనుందని తెలుస్తోంది.

#India #Liquor Price #ChinaApps #NoMore #Imported Scotch

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

No More Scotch India Ban Imported Goods Military Shops Related Telugu News,Photos/Pics,Images..