నిజమా : 2021 నుండి రైల్లో ప్రయాణించాలని పరితపిస్తారట, ఎందుకంటే..!

బ్రిటిష్‌ వారు ఇండియాలో రైల్వేను ప్రారంభించిన విషయం తెల్సిందే.ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్స్‌లో మూడవ వంతు అప్పట్లో బ్రిటీష్‌ వారు వేయించినవే అనే విషయం చాలా మందికి తెల్సిందే.

 No More Bore In Train Journey Says Indian Railways-TeluguStop.com

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్స్‌ను టెక్నాలజీతో అభివృద్ది చేయడం చేస్తున్నారు తప్ప రైల్లను మరియు కొత్త రూట్లను తీసుకు వస్తున్నది లేదు.విమానయాన రంగం ఎంతగా అభివృద్ది చెందిందో అందులో కనీసం ఒకటవ వంతు కూడా రైల్వే అభివృద్ది చెందలేదు అని చెప్పక తప్పదు.

ఎన్నో పాతవిధానాలను అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు.టికెట్లను ఆన్‌లైన్‌లో అయితే ఇస్తున్న రైల్వే శాఖ ప్రయాణికులు రైలు ఎక్కిన తర్వాత ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం లేదు.

అనేక రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులను మాత్రం రైల్వేలో తీసుకు వచ్చేందుకు ఎవరు ముందుకు రావడం లేదు అనుకుంటున్న సమయంలో ఈసారి ప్రభుత్వం రైల్వేలో కొత్త పద్దతులు మరియు ప్రయాణికుల అవసరం కోసం అనేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.ముఖ్యంగా గంటలకు గంటలు ప్రయాణించే రైలులో ఎంటర్‌టైన్‌ మెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చాలా కాలంగా డిమాండ్‌ వినిపిస్తుంది.

Telugu Britishstart, Indianrailway, Boretrain, Railwaytvs, Telugu General, Train

రైల్వే ప్రయాణికులు దూర ప్రయాణాలు చేసే వారు 40 గంటలు 50 గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుంది.అలాంటి వారి కోసం అనే ఉద్దేశ్యంతో టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇప్పటికే కొన్ని రైల్లలో ఉన్నాయి.2021 వరకు దేశంలో ఉన్న అన్ని రైల్లలో కూడా టీవీలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఇండియన్‌ రైల్వే ప్రకటించింది.దీనికి గాను ప్రైవేట్‌ రంగంను ఆశ్రయించారు.

రైలులోని టీవీలు ఏర్పాటు చేసి దాంటో ప్రకటనలు ఇచ్చుకునే అవకాశంను కంపెనీలకు ఇవ్వబోతున్నారు.

Telugu Britishstart, Indianrailway, Boretrain, Railwaytvs, Telugu General, Train

రైల్వేలో పూర్తి స్థాయిలో టీవీలను ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా అదో మంచి పరిణామంగా భావించవచ్చు.ఎందుకంటే ప్రతి ప్రయాణికుడు కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుకోవడం జరుగుతుంది.అలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తే ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube