ఇకపై ఫోన్లకు నో బ్యాక్టీరియా.. అంతేకాదు సబ్బుతో కడగొచ్చు కూడా..!

ప్రపంచం నలుమూలల రోజూ ఏదో ఒక టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం.స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చాక ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకున్నట్లు అయ్యింది ప్రతి ఒక్కరికి.

 No More Bacteria For Phones And Can Also Be Washed With Soap, No More, Bacteria,-TeluguStop.com

ఇంట్లో కూర్చొని ఎన్నో రకాల పనులను ఇట్లే చక్కదిద్దుకుంటున్న వారు ప్రస్తుతం ఎందరో.అంతేకాదు ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్ లాంటి ఎన్నో సామాజిక మార్గాలు ఉండడంతో వేరే దేశాల్లో ఉన్న కానీ మనుషుల మధ్య దూరాన్ని మాత్రం తగ్గించేస్తున్నాయి.

అయితే టెక్నాలజీ పరంగా మనం ఎంత దూసుకువెళ్తున్న అప్పుడప్పుడు ప్రపంచం నలుమూలల కొత్తరకమైన వ్యాధులు వచ్చి ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

దాదాపు గత పది నెలలకు పైగా ప్రపంచాన్ని కరోనా వైరస్ ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కరోనా వైరస్ నుంచి బయటపడాలంటే చేతులు కడుక్కోవడం, అలాగే భౌతిక దూరం పాటించడం లాంటి పనులను మనం చూస్తున్నాం.అయితే ఇవన్నీ పక్కనపెడితే మన జీవితంలో ఒకటిగా మారిపోయిన స్మార్ట్ఫోన్ ను ఎంతమంది ప్రతిరోజు శుభ్రపరుస్తారో అన్నది అసలైన ప్రశ్న.

ఇకపోతే బాక్టీరియా అంటకుండా మన చేతులను సబ్బు పెట్టి కడిగినట్టు స్మార్ట్ ఫోన్ లను మనం సబ్బు పెట్టి కడగవచ్చు ఇకపై.అవును మీరు వింటున్నది నిజమే.ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ను నీటితో కడిగేసేందుకు ఇంగ్లాండ్ దేశానికి చెందిన స్టార్టప్ సంస్థ ఓ కొత్త రకమైన స్మార్ట్ ఫోన్ ను తీసుకు వచ్చింది.S42 పేరు గల ఈ స్మార్ట్ ఫోన్ గా, అలాగే వాటర్ రెసిస్టెంట్ గా పని చేయనుంది.వచ్చే సంవత్సరంలో విడుదల కాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్స్ పై భాగంలో ఓ పోరా కూడా కప్పబడి ఉంటుంది.ఈ టెక్నాలజీకి బయో మాస్టర్ యాంటీ మైక్రోబయో టెక్నాలజీ అని పిలుస్తున్నారు.ఈ టెక్నాలజీ ద్వారా మొబైల్ ఫోన్స్ పై ఉన్న బ్యాక్టీరియా పూర్తిగా చనిపోక పోయినా పదిహేను నిమిషాలు ఫోన్ పై ఉంటే మాత్రం 85 శాతం వరకు తగ్గుతుందని, అలాగే 24 గంటలు ఉంటే 99.9 శాతం వరకు తగ్గుతుందని సంస్థ యజమానులు తెలుపుతున్నారు.అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ ను సబ్బుతో గాని, శానిటైజర్ గాని, లేదా మరో పదార్థంతో గాని శుభ్రం చేసుకోవచ్చని వారు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube