సారీ అమ్మ కవిత: మంత్రి పదవి ఆశలపై నీళ్లు చిమ్మిన కేసీఆర్ ?

తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబ పాత్ర ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తెలంగాణ ఉద్యమం, పార్టీ ఏర్పాటు, అధికారంలో కి రావడం ఇలా అన్నిటిలోనూ కేసీఆర్ కుటుంబం అంతా యాక్టివ్ రోల్ పోషించారు.

 No Minister Post To Cm Kcr Daughter Kavitha-TeluguStop.com

ఇక తెలంగాణతో పాటు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తన కుటుంబ సభ్యులకు కూడా అంతే స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చారు.తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉండగా, కుమారుడు కేటీఆర్ మంత్రిగా ఉన్నారు.

మేనల్లుడు మంత్రిగా ఉన్నారు.టీఆర్ఎస్ మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తరువాత కవిత ఎంపీగా గెలిచారు.

అయితే రెండోసారి జరిగిన ఎన్నికల్లో మాత్రం కవిత నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు.ఇక అప్పటి నుంచి ఆమె రాజకీయ సన్యాసం చేస్తూ వచ్చారు.

అయితే ఆమెకు రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందని, ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా ఆమెకు కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వలేదు.

ఆమెకు బదులుగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కి అవకాశం ఇచ్చారు.

దీంతో ఆమె అలిగినట్టు వార్తలు కూడా వచ్చాయి.ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల తరపున ఆమెను ఎమ్యెల్సీగా కేసీఆర్ అవకాశం కల్పించారు.

దాదాపు ఆమె ఎమ్యెల్సీగా నియామకం ఖరారయ్యింది.దీంతో ఆమెకు మంత్రి పదవి దక్కుతుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

కవిత కూడా అదే ఆశతో ఉండగా కేసీఆర్ మాత్రం కవితకు మంత్రి పదవి ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం.చాలా కాలంగా తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ మీద విమర్శలు వస్తున్నాయి.

మొత్తం కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు ఇస్తున్నారనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమెకు మంత్రిగా అవకాశం ఇవ్వకూడదు అని కేసీఆర్ డిసైడ్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది .కేసీఆర్ తన కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకే ముఖ్యమంత్రి తన కుమార్తె కల్వకుంట్ల కవితకు మంత్రి పదవి ఇవ్వకూడదని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.రాజ్యసభ సీటు కోసం కవిత గట్టిగా డిమాండ్ చేయడంతో ఎమ్మెల్సీగా శాసనమండలికి పంపుతానని, దీనిని అడ్డం పెట్టుకుని మంత్రి పదవి మాత్రం కొరవద్దు అంటూ షరతు విధించినట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube