అల్లుడిని వదిలేసిన మెగా హీరోలు.. సూపర్ మచ్చి గురించి వార్తే లేదు!

No Mega Hero Has Been Promoting Chiranjeevi Son In Law Kalyan Dev Super Machi Movie

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే.మెగా ఫ్యామిలీ నుంచి ఒక కొత్త హీరో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు అంటే మెగా ఫ్యామిలీ లోని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ప్రమోట్ చేస్తూ ఉంటారు.

 No Mega Hero Has Been Promoting Chiranjeevi Son In Law Kalyan Dev Super Machi Movie-TeluguStop.com

కానీ ఈసారి మెగా హీరోలు మాత్రం వారి ఇంటి అల్లుడు నటించిన సినిమా గురించి ఎవరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు శ్రీజ భర్త కళ్యాణ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి సినిమా సంక్రాంతి కి విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

నేడు సూపర్ మచ్చి సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

 No Mega Hero Has Been Promoting Chiranjeevi Son In Law Kalyan Dev Super Machi Movie-అల్లుడిని వదిలేసిన మెగా హీరోలు.. సూపర్ మచ్చి గురించి వార్తే లేదు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

అంతేకాకుండా గత ఏడాది ఆర్థిక సమస్యల కారణంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ కూడా చేశారు.ఇక ఈ సంక్రాంతి బరిలో నుంచి పెద్ద పెద్ద సినిమాలు తప్పుకోవడంతో ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావించారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే సూపర్ మచ్చి సినిమా విడుదలకు సిద్ధం అయింది.అయితే తెలుగు టాలీవుడ్ లో ఇప్పటికే పలు సినిమాలు సంక్రాంతికి విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

Telugu Chiranjeevi, Kalyan Dev, Machhi-Movie

మిగిలిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పవచ్చు.ఈ సినిమాను పులి వాసు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించారు.ఇందులో కళ్యాణ్ దేవ్ సరసన రచిత రామ్ హీరోయిన్ గా నటించింది.ఇది ఇలా ఉంటే ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుంది అని తెలిసినా కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క హీరో కూడా ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కూడా చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అయితే బయట హీరోల ఫ్రీ రిలీజ్ వేడుకకు వెళ్ళిన రామ్ చరణ్ తన సొంత బావ సినిమాను మాత్రం పక్కన పెట్టేశాడు.ఈ సినిమాకు సంబంధించి ఒక ట్వీట్ కూడా చేయలేదు మన మెగా హీరోలు.

దీనితో ఇదే విషయం పై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.దీని వెనుక ఏమైనా జరిగిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

#Kalyan Dev #Machhi #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube