ఎంతయినా ఇచ్చేద్దాం ..డబ్బుతో కొనేద్దాం !

ఎన్నికల సమయంలో ప్రతి అంశం ఎంతో కీలకమైంది.ప్రతి చిన్న కార్యకర్త పార్టీకి ఎంతో అవసరం.

 No Matter How Much Of Money In Elections-TeluguStop.com

ఇక ఈ సమయంలో కుల సంఘాల నాయకుల మాట అయితే చెప్పనవసరం లేదు.మా చేతిలో అన్ని ఓట్లు ఉన్నాయి, ఇన్ని ఓట్లు ఉన్నాయి అంటూ హడావుడి చేస్తూ ఉంటారు.

నిజంగా వారు ఆ కులాలను ప్రభావితం చేసినా, చేయకపోయినా పార్టీలు వారికి ఎక్కడలేని ప్రాధాన్యం ఇస్తుంటాయి.ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఎంతో లేదు.

దీంతో అభ్యర్థులు ఎండనక వాననకా తెగ తిరిగేస్తూ ప్రచారం చేసేస్తున్నారు.మరోవైపు ఓటర్లను కొనుగోలు చేయడం అనే పనిలో పడ్డారు.

దీని కోసం ఇందుకోసం పార్టీ కార్యకర్తలకు, నియోజక వర్గాల్లో సీనియర్ నాయకులుగా చెప్పుకుంటున్న వారికి డబ్బులు పంపిణి చేస్తున్నట్టు సమాచారం.

ముఖ్యంగా గతంలో అధికారాన్ని అనుభవించిన వారు ఈసారి ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలనే కోరికతో ఓటర్లకు ఎంత డబ్బైనా ఇవ్వడానికి సిద్దమయిపోతున్నారు.

గత ఎన్నికలలో ఓటుకు రెండు వేల రూపాయల వంతున పంచి పెట్టి విజయాన్ని సాధించిన వారు ఈసారి దానికి డబుల్ ఇచ్చేందుకు కూడా వెనుకాడడంలేదు.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని అనేక నియోజకవర్గాల్లో ఓటర్లకు పంచేందుకు అవసరమైన నిధులు అన్ని పార్టీలు సిద్ధం చేసుకున్నాయి.

ఈసారి ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని, ఓటర్లు ఎంత మొత్తం డిమాండ్ చేసినా ఇచ్చేందుకు వెనకాడకూడదని పార్టీలు డిసైడ్ అయిపోయాయి.ఏపీలోని అనేక నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ ల వారీగాను, గ్రామాలు, వార్డుల వారీగా డబ్బులు పంచేందుకు పార్టీలు సిద్ధమైనట్లు చెబుతున్నారు.వ్యక్తిగతంగా డబ్బులు పంచడంతోపాటు కుల సంఘాలకు, వివిధ కాలనీలకు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు పంచేందుకు సిద్ధం అవుతున్నారు.సమయం చాలా తక్కువగా ఉండడంతో ఎవరికీ అనుమానం రాని వ్యక్తుల చేత ఈ డబ్బుల పంపిణీ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube