నోరు విప్పని జగన్ ! నష్టం ఎంత అంటే ? 

151 సీట్ల తో తిరుగులేని మెజారిటీ దక్కించుకుని , బలమైన రాజకీయ పార్టీగా ఉన్న టీడీపీని కేవలం 23 స్థానాలకే పరిమితం చేయడంలో వైసీపీ అధినేత జగన్ సక్సెస్ అయ్యారు.ఇక అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజా సంక్షేమ పథకాలే లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్తున్నారు.

 No Matter How Many Criticisms The Opposition Makes Jagan Remains Silent Jagan, Y-TeluguStop.com

ప్రజలు ఎక్కడ ఏ విషయంలో ఇబ్బందులు పడకుండా అన్ని రకాలుగానూ ఆదుకునే విధంగా సరికొత్త పథకాలను రూపొందించి , వాటిని అమలు చేయడం భారమైన , జగన్ లెక్క చేయకుండా వాటిని అమలు చేస్తున్నారు .గత ముఖ్యమంత్రులకు తాను భిన్నంగా ఉండాలని , పూర్తిగా తన పరిపాలనపై సంతృప్తి పెరగాలనే లక్ష్యంతో జగన్ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు.2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసిపి బలాన్ని  పెంచుకుంటూ వెళ్తున్నారు.ఇంత వరకు బాగానే ఉన్నా , వైసీపీ ప్రభుత్వం పై టిడిపి, జనసేన ,బీజేపీ వంటి పార్టీలు విమర్శలు చేస్తూనే వస్తున్నాయి.

         జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నిర్ణయాలలోని చిన్న చిన్న లోపాలను ఎత్తి చూపిస్తూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ప్రజల్లోకి ఆ విషయాలను తీసుకు వెళుతూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, వైసీపీ ప్రభుత్వం ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా అనేక ఆరోపణలు చేస్తున్న,  జగన్ మాత్రం ఏ విషయంలోనూ స్పందించడం లేదు.ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు ఆధారాలు లేకపోయినా జనాల్లోకి మాత్రం ఆ విషయాలు వెళ్ళిపోతున్నాయి.

ఈ విషయాలు వైసీపీ కి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నా, జగన్ ఆ విషయాల పైన మీడియా ముందుకు వచ్చి స్పందించేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు.

 

Telugu Ap Cm, Ap, Ap Ministers, Chandrababu, Jagan, Ysrcp, Ysrcp Mlas-Telugu Pol

     ప్రత్యర్ధులు చేసే విమర్శలపై పార్టీ ఎమ్మెల్యేలు,  మంత్రుల ద్వారానే సమాధానం ఇస్తున్నారు తప్పించి ,జగన్ మాత్రం నోరు విప్పడం లేదు.ప్రతిపక్షాల విమర్శలకు మంత్రులు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పినా, జనాల్లోకి పెద్దగా వెళ్లదు అదే విషయాన్ని జగన్ స్వయంగా చెబితే,  జనాలకు ఆ విషయం స్పష్టంగా అర్థం అవ్వడంతో పాటు,  వైసీపీ ప్రభుత్వం పై మరింత నమ్మకము ఏర్పడుతుంది.కానీ జగన్ మాత్రం ఆ విధంగా చేసేందుకు ఇష్టపడడం లేదు.

వైసిపి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది అంటే దానికి ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం ఒక కారణం.అప్పటి టీడీపీ ప్రభుత్వం పై వైసిపి సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా పోరాటాలు చేసింది.

  జనాల్లోకి టిడిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకువెళ్ళింది.
     

Telugu Ap Cm, Ap, Ap Ministers, Chandrababu, Jagan, Ysrcp, Ysrcp Mlas-Telugu Pol

ఇప్పుడు అదే సోషల్ మీడియాలో తమ రాజకీయ ప్రత్యర్ధులు ఉపయోగించుకుని పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నా, జగన్ స్పందించకపోవడం, ప్రతిపక్షాల విమర్శలను అసలు ఏమాత్రం పరిగణలోకి తీసుకొనట్టుగా వ్యవహరిస్తుండడం వంటి కారణాలతో జనాల్లో ప్రతిపక్షాలు చేసే విమర్శలు ఎక్కువ హైలెట్ అవుతున్నాయి.ఈ విషయంలో జగన్ మరింత శ్రద్ధ తీసుకుని నేరుగా ఆయన కీలకమైన విషయాలు స్పందిస్తే బాగుంటుందనే అభిప్రాయం వైసిపి నాయకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube