అమెరికాలో రాముడి భారీ డిస్ ప్లే పై నిరసనలు..!!

భారత దేశ ప్రజలు ఎంతో మంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర శంకుస్థాపన ఈరోజు 05 -08-2020 న ఎంతో అంగరంగ వైభవంగా జరగనుంది.ఈ వేడుకల కోసం ఎంతో మంది హిందువులు, సాధువులు, హిందూ సాంప్రదాయాన్ని వ్యాప్తి చేసే స్వామీజీలు దేశం నలుమూలల నుంచీ తరలి రానున్నారు.

 No 3d Images Of Lord Rama Ny Timesquare , Ram Mandhir, Bhoomi Puja, Islamophobic-TeluguStop.com

అంతేకాదు రామ మందిర నిర్మాణం కోసం ఎంతో భారతీయులు, విదేశాలలో ఉంటున్న ఎన్నారైలు కోట్లాది రూపాయలు కానుకగా ఇచ్చారు కూడా.ఈ క్రమంలోనే అమెరికాలోని అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫైర్స్ కమిటీ రాముడి ఆలయ నిర్మాణం కి సంభందించి, అలాగే రాముడి ఫోటోలు , నామాలు న్యూయార్క్ టైం స్క్వేర్స్ పై భారీ డిస్ ప్లే ద్వారా ప్రదర్సనకి ఉంచింది.

ఆగస్టు 5 ఉదయం 8 గంటల నుంచీ సాయంత్రం 10 గంటల వరకూ ఈ డిస్ ప్లే ని ఉంచనున్నారు.ఎంతో మంది భారతీయ సమాజం ఈ డిస్ ప్లే బోర్డ్ వద్దకి రానున్నారని తెలుస్తోంది.

ఇదిలాఉంటే ఇప్పుడు ఈ డిస్ ప్లే బోర్డ్ పై వివాదం రేగుతోంది.దీనివలన గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని బోర్డ్ ని తీసేయమని దాదాపు 20 కమ్యూనిటీ సంఘాలు మేయర్ కి ప్రభుత్వానికి ఆర్జీలు పెట్టుకున్నాయి.

ఇలా అభ్యర్ధన పెట్టుకున్న వారిలో ముస్లిం సంఘాలు కూడా ఉన్నాయి.వారు రాసిన లేఖలో భారత్ లో ముస్లిం లపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయని.

బాబ్రి మసీద్ కూల్చి వేసిన ఘటనలో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని భారతీయ జనతా పార్టీ ముస్లిం లకు వ్యతిరేకమని తెలిపారు.అమెరికాలో ప్రస్తుత సమయంలో ఒక మతానికి అనుకూలంగా ఇలాంటి ప్రకటనలు రావడం మత ఘర్షణలకి చోటు ఇచ్చే అవకాశం ఉంటుందని వెంటనే ఈ బోర్డ్ ను తీసేయలని కోరారు.

అంతేకాదు ఈ బోర్డ్ ని తీసేయమని సదరు మేయర్ తో సహా కొన్ని కమ్యూనిటీ లు యాడ్ కంపెనీపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube