లవ్ స్టోరిలో పరువుహత్య.. నవ్వుతున్నారట!

టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి, ఎట్టకేలకు ఈ నెల 24న రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి తనదైన మార్క్ వేసేందుకు శేఖర్ కమ్ముల రెడీ అవుతున్నాడు.

 No Link Of Miryalaguda Honor Killing In Love Story-TeluguStop.com

ఇక ఈ సినిమాలో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్‌లో ఉండబోతుందో, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు చూస్తే అర్థమవుతోంది.

ఇక ‘లవ్ స్టోరి’ చిత్రంలో ఎలాంటి కథ ఉండబోతుందా అనే అంశంపై ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో హీరోహీరోయిన్లు వేర్వేరు కులాలకు చెందిన వారు ఉంటారని, దీంతో వారి ప్రేమనచ్చని పెద్దవారు పరువు హత్యకు పాల్పడుతారని ఓ వార్త సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

 No Link Of Miryalaguda Honor Killing In Love Story-లవ్ స్టోరిలో పరువుహత్య.. నవ్వుతున్నారట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇది గతంలో తెలంగాణలోని మిర్యాలగూడలో జరిగిని పరువు హత్యను పోలి ఉన్న కథ అని చిత్ర వర్గాల్లో చర్చ సాగుతోంది.ఈ విషయం తెలుసుకున్న చిత్ర యూనిట్ అవాక్కయ్యారు.

అసలు ఈ సినిమాలో అలాంటి అంశమే లేదని వారు అంటున్నారు.

కాగా ఇదే విషయం చిత్ర నిర్మాతల వరకు వెళ్లగా, వారు పక్కున నవ్వుతున్నారట.

ఈ సినిమాలో అలాంటి అంశమే లేదని, ఇది సరికొత్త లవ్ స్టోరి అని వారు అంటున్నారు.ప్రేక్షకుల మనసులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల తీర్చిదిద్దాడని వారు అంటున్నారు.

ఇక ఈ సినిమాలో చైతూ, సాయి పల్లవిల పర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులను కట్టిపడేయం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.కాగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24న రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందా అని ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

మరి ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

#Love Story #Sai Pallavi #Sekhar Kammula #Naga Chaitanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు