ఆ రెండు పాత్రలు లేకుండానే ఎన్ఠీఆర్ బయోపిక్..! అలా చేయడం వెనకున్న కారణం ఇదే.!

మహానటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను తన కుమారుడు నందమూరి నటసింహం బాలకృష్ణ ‘యన్.టి.

 No Krishna And Shoban Babu Characters In Ntr Bio Pic-TeluguStop.com

ఆర్’ అనే టైటిల్‌తో తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.క్రిష్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి రోజుకో అప్‌డేట్‌తో చిత్రయూనిట్ సంచనాలను క్రియేట్ చేస్తోంది.

జనవరి 9న ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’, జనవరి 24న ‘యన్.టి.ఆర్- మహానాయకుడు’గా విడుదలకానున్న ఈ బయోపిక్ నుంచి మరో వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది.

రామారావు గారి జీవిత చరిత్ర లో తెలుగు సినిమా రంగంలో కృష్ణ, శోభన్ బాబుగారి పాత్రలతో ముడిపడిన విషయాలు సందర్భాలు చాలానే ఉన్నాయి.కానీ సినిమాలో మాత్రం వారిద్దరి పాత్రలు లేకుండానే తెరకెక్కిస్తున్నారు.దానికి కారణం ఆ పాత్రలకు సరైన నటులు దొరకకపోవడం.

మొదట్లో కృష్ణ పాత్రలో మహేష్ బాబు కనిపిస్తాడు అన్న వార్తలు వచ్చాయి, బాలకృష్ణ కూడా కృష్ణ పాత్రలో మహేష్ అయితేనే బాగుంటుందని భావించారట, అయితే మహేష్ బాబు నుండి ఇంకా ఎటువంటి స్పందన రాకపోవటం తో కృష్ణ పాత్రని తొలగించారట.కృష్ణ పాత్రే లేనప్పుడు, అంతగా ప్రాధాన్యం లేని శోభన్ బాబు పాత్ర కూడా అవసరం లేదని భావించి తొలగించారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube