మోహన్ బాబుని అవమానించారంటున్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల క్రితం హీరోగా ఎన్నో హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు మోహన్ బాబు.500కు పైగా సినిమాల్లో నటించిన మోహన్ బాబు పదుల సంఖ్యలో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.గత కొన్నేళ్లుగా మోహన్ బాబు పరిమిత సంఖ్యలో సినిమాల్లో నటిస్తున్నారు.ఈ మధ్య కాలంలో మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా తెరకెక్కిన కొన్ని సినిమాల్లో నటించిన మోహన్ బాబు ఈ నెల 12న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఆకాశం నీ హద్దురా సినిమాలో నటించారు.

 No Importance For Mohan Babu Role In Aakasham Ni Haddura Movie, Aakasham Ni Hddu-TeluguStop.com

ఆకాశం నీ హద్దురా సినిమాకు హిట్ టాక్ రాగా ఈ సినిమాలో మోహన్ బాబు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో నటించారు.చాలాకాలం తర్వాత సినిమాల్లో నటించిన మోహన్ బాబు ఆకాశం నీ హద్దురా సినిమాలో ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్రలో నటించడంతో ఆయన ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

సినిమాలో మోహన్ బాబు కేవలం నాలుగంటే నాలుగు సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తారు.దీంతో మోహన్ బాబుకు అంత చిన్న పాత్ర ఇచ్చి అవమానించారంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Telugu Aakashamni, Mohan Babu Role, Importance, Surya-Latest News - Telugu

కొందరు ఫ్యాన్స్ మోహన్ బాబు ఎక్కువ సీన్లలోనే నటించినా ఎడిటింగ్ లో కొన్ని సీన్లను తొలగించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.ఆకాశం నీ హద్దురా సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చినా మోహన్ బాబు సైలెంట్ గా ఉండటంతో ఫ్యాన్స్ అనుమానాలు నిజమేనా.? అనే సందేహం కలుగుతోంది.కొందరు అభిమానులు అలాంటి పాత్రకు మోహన్ బాబు ఎందుకు ఒప్పుకున్నాడో తమకు అర్థం కావడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు చాలా సంవత్సరాల నుంచి ప్రయోగాత్మక సినిమాల్లో నటిస్తూ హిట్టు కోసం ఎదురు చూస్తున్న సూర్యకు ఈ సినిమాతో హిట్ దక్కింది.గత కొన్ని నెలలుగా విడుదలైన ప్రతి సినిమా ఫ్లాప్ కావడంతో టెన్షన్ పడుతున్న అమెజాన్ నిర్వాహకులకు ఆకాశం నీ హద్దురా సినిమాతో భారీ విజయం దక్కింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube