అప్పుడు ఆ మాట....ఇప్పుడు ఈ మాట...!

నాయకులే కాదు, ఆ నాయకులు ఏర్పాటు చేసే ప్రభుత్వాలు కూడా మాటలు మారుస్తాయి.ఇక్కడ ప్రభుత్వాలు అంటే మంత్రులని గుర్తు పెట్టుకోవాలి.

 No Idea Where Dawood Ibrahim Is-TeluguStop.com

ఒకే విషయం మీద సీనియర్‌ మంత్రి ఒక విధంగా చెబితే.జూనియర్‌ మంత్రి మరోలా చెబుతాడు.

ఇదెలా సాధ్యం? ఇద్దరి మధ్య సమన్వయం ఉండదా? ఒకరు చెప్పింది ఇంకొకరికి తెలియదా? కీలకమైన అంశాలపై ఇద్దరూ భిన్నంగా మాట్లాడితే సర్కారు ప్రజల్లో చులకన కాదా? ఇలా మనం ప్రశ్నలు వేసుకుంటాం గాని ఆ మంత్రులు అసలు ఏం పట్టించుకోరు.ఇక అసలు విషయానికొస్తే తాజాగా పార్లమెంటులో ప్రభుత్వం పేరు మోసిన అండర్‌ వరల్‌్డ డాన్‌, అంతర్జాతీయ మాఫియా నాయకుడు దావూద్‌ ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడో తెలియదని ప్రకటించింది.

హోం శాఖ సహాయ మంత్రి హరి భాయ్‌ చౌధురి ఈ ప్రకటన చేశారు.దావూద్‌ పాకిస్తాన్‌లో ఉన్నాడని పదో తరగతి పిల్లవాడిని అడిగినా చెబుతాడు.కాని ఘనత వహించిన మోదీ సర్కారుకు మాత్రం తెలియదు.దావూద్‌ కోసం వెదుకుతున్నారట.

కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గత ఏడాది డిసెంబరులో ఏం చెప్పారంటే…దావూద్‌ ఇబ్రహీంను అప్పగించాలని తాము అనేకసార్లు పాకిస్తాన్‌ను కోరామని చెప్పారు.ఓపిక పట్టండి.

చర్య తీసుకుంటాం అన్నారు.అప్పుడు పెద్ద మంత్రి అలా చెబితే, ఇప్పుడు చిన్న మంత్రి ఇలా సెలవిచ్చారు.

యాభై మంది ‘మోస్‌్ట వాంటెడ్‌’ ఉగ్రవాదుల్లో దావూద్‌ది ఎనిమిదో నెంబరు.పాక్‌ తనకు తానై అప్పగిస్తే తప్ప దావూద్‌ను పట్టుకోవడం భారత్‌కు సాధ్యం కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube