మరణించిన మానవత్వం.. ఎవరికి ఎవరు కారని నిరూపిస్తున్న కరోనా.. !

కరోనా పేరుకు మూడక్షరాలే గానీ ఇది సృష్టిస్తున్న వినాశనం మాత్రం ఒక చరిత్రనే తిరగ రాస్తుంది.మానవ బంధాలను మంట గలుపుతుంది.

 No Humanity Among The People Over Corona Dead Bodies , Corona, Proving, Dead Hum-TeluguStop.com

చావు పుట్టుకలు భగవంతుని చేతుల్లో ఉంటాయని ఇంత కాలం అనుకున్నారు.కానీ చావు మాత్రం ప్రస్తుతం కరోనా వైరస్ కొరల్లో చిక్కుకుంది.

లోకంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు మనుషులకు ఎన్నో పాఠాలు నేర్పుతున్నాయి.ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో కళ్లకు కట్టినట్లుగా 70యంయంలో ప్రదర్శిస్తున్నాయి.బ్రతికినన్ని నాళ్లు నాది నాది అంటూ స్వార్ధంతో బ్రతుకుతూ, పేదల పొట్టకొట్టి కోట్లు కూడపెట్టిన వారికి ఈ సమయంలో జ్ఞానోదయం కలిగిస్తే బాగుండును ఈ కరోనా.

ఇదిలా ఉండగా తెలంగాణలో కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలుతున్న సంగతి తెలిసిందే.

అయితే మరణించిన వారి మృతదేహాలు ఆసుపత్రుల్లో పేరుకుపోతుండటం బాధాకరం.నావాడు, నీ వాడు అని, నా ఆస్తి అంటూ విర్రవీగిన మనుషుల మధ్య సంబంధాలను పూర్తిగా తెంచివేసి దరికి చేరలేనంత దూరాన్ని పెంచిన కోవిడ్ వల్ల కనీసం అయిన వారి దగ్గరికి వెళ్లాలన్న ఆలోచించ వలసిన అవసరం వచ్చింది.

Telugu Corona, Corona Wave, Humanity, Funerals, Gandhi, Telangana-General-Telugu

దీని వల్ల కరోనాతో మరణించిన మృతదేహాలు అనాధ శవాల్ల అంత్యక్రియల కోసం ఆశతో ఎదురు చూసే పరిస్దితి తలెత్తింది.అంతే కాకుండా కోవిడ్ మృతదేహాలను బంధువులకు అప్పగించడంలో సంక్లిష్టత ఏర్పడటం, అంత్యక్రియలకు రూ.25 వేలకు పైనే ఖర్చు అవుతుండటంతో శవాలను తీసుకువెళ్లేందుకు కన్న వారు కూడా ముందుకు రావడం లేదట.

ఇక అంత్యక్రియల ఖర్చులు భరించేంతా ఆర్థిక స్థోమత లేని వారు తమ వారి శవాలను అక్కడే వదిలేస్తుండటంతో ప్రస్తుతం గాంధీ మార్చురీలో 300 మృతదేహాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

కాగా కుప్పలు తెప్పలుగా పడి ఉన్న మృతదేహాల నుంచి దుర్వాసన వస్తోందని, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని సిబ్బంది వాపోతున్నారట.చూశార ప్రస్తుతం లోకంలో మానవత్వం మరణించి ఎవరికి ఎవరు కారని కరోనా నిరూపిస్తుందని అనుకుంటున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube