సీబీఐపై విశ్వ‌స‌నీయ‌త స‌న్న‌గిల్లుతోందా..? వారంలో రెండు ఘ‌ట‌న‌లు

ఔను! పేరెన్నిక‌గన్న‌.సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్-సీబీఐ విశ్వ‌స‌నీయ‌త‌పై తాజాగా వెలువ‌డిన బాబ్రీమ‌సీదు తీర్పు.

 No Hopes On Cbi, Cbi, Babri Masjid Demolition Case, Special Cbi Court, Wrong Ver-TeluguStop.com

అనేక సందేహాల‌ను తీసుకువ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఏం జ‌రిగినా.

స్థానిక పోలీసుల‌పై న‌మ్మ‌కం స‌న్న‌గిల్లిన ద‌రిమిలా.అక్క‌డి ప్ర‌తిప‌క్షాలు.

నేరుగా సీబీఐని ఆశ్ర‌యిస్తున్నాయి.దేశంలో అనేక వంద‌ల కేసులు ఇప్పుడు సీబీఐ విచారిస్తోంది.

అనేక కోణాల్లో నిష్పాక్షిక ద‌ర్యాప్తు చేయ‌డంతో పాటు.బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా.

నిందితులు ఎంత‌టివారైనా కూడా న్యాయం ముందు అంద‌రూ స‌మానులే అన్న రాజ్యాంగ స్ఫూర్తికి సీబీఐ నిల‌బ‌డుతుంద‌న్న విశ్వాసం అంద‌రిలోనూ ఉంది.

కానీ, గ‌డిచిన 48 గంట‌ల్లో సీబీఐ విచార‌ణ‌ల‌కు సంబంధించి రెండు తీర్పులు వ‌చ్చాయి.

ఈ రెండు తీర్పుల్లోనూ సీబీఐ విచార‌ణ లోపాల‌ను కోర్టులు ఎండ‌గ‌ట్టాయి.చిత్రం ఏంటంటే.

రెండు తీర్పులు కూడా కేంద్రాన్ని , ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను మ‌రీముఖ్యంగా ప్ర‌జ‌ల విశ్వాసాల‌ను న‌మ్మ‌కాన్ని ప్ర‌భావితం చేసేవే కావ‌డం గ‌మ‌నార్హం.రెండు రోజుల కింద‌ట చెన్నైకి చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త శేఖ‌ర్‌రెడ్డికి చెందిన కేసులో స్థానిక సీబీఐ కోర్టు తీర్పు వెలువ‌రిచింది.

పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ఆయ‌న ఇంట్లోను, గోడౌన్‌లోను.క‌నీసం సీలు కూడా తీయ‌ని.రూ.2000, రూ.500 నోట్ల క‌ట్ల‌ను సీబీఐ అధికారులు సీజ్ చేశారు.

దాదాపు ఇవి 10 వేల కోట్ల వ‌ర‌కు ఉంటాయ‌ని అప్ప‌ట్లో లెక్క‌లు తేల్చారు.

ఈ సొమ్ము ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? నేరుగా ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచే శేఖ‌రెడ్డి ఇంటికి ఎలా చేరింద‌నేది అప్ప‌ట్లో విస్మ‌యం క‌లిగించింది.దీనిని విచారించిన సీబీఐ.

శేఖ‌రెడ్డి స‌హా ప‌లువురుని నిందితులు గా చేర్చింది.అయితే, తాజాగా వ‌చ్చిన తీర్పులో అంద‌రినీ నిర్దోషులుగా కోర్టు పేర్కొన‌డంతోపాటు.

స‌ద‌రు న‌గ‌దు వైట్ మ‌నీ అని తేల్చేసింది.మ‌రి సీబీఐ ఎందుకు కేసు న‌మోదు చేసిన‌ట్టు.? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.ఇక‌, ఇప్పుడు బాబ్రీ కేసు.

దాదాపు 28 ఏళ్లుగా సుదీర్ఘంగా సాగిన ఈ కేసులోను.సీబీఐ ప్ర‌త్యేక కోర్టు ఎల్ కే అద్వానీ, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి, ఉమాభార‌తి వంటి దిగ్గ‌జ నేత‌ల‌కు క్లీన్ చిట్ ఇచ్చింది.

అంతేకాదు, సీబీఐ విచార‌ణ‌లో లోపాలు ఉన్నాయ‌ని, స‌రైన విచార‌ణ సాగ‌లేద‌ని, అన‌వ‌స‌రంగా కేసు న‌మోదు చేశార‌ని, బాబ్రీ మ‌సీదు కూల్చివేత‌.అనేది ఉద్దేశ పూర్వ‌కంగా జ‌రిగింది కాద‌ని తేల్చి చెప్పింది.

దీనిని బ‌ట్టి దేశం మొత్తం న‌మ్మ‌కం పెట్టుకున్న సీబీఐపై సందేహాలు ముసురుకున్నాయి.కేసు విచార‌ణ‌లో పార‌ద‌ర్శ‌కత లేదా? లేదా స్వతంత్ర సంస్థ‌పై ఒత్తిళ్లు ఉన్నాయా? లేక‌.సీబీఐ విచార‌ణే లోప‌భూయిష్టంగా ఉందా? ఇలాంటి ప్ర‌శ్న‌లు అనేకం తెర‌మీదికి వ‌చ్చాయి.వీటికి కాల‌మే స‌మాధానం చెప్పాలి.

సీబీఐ వంటి సంస్థ‌లే విశ్వ‌స‌నీయ‌త‌ను పోగొట్టుకుంటే.దేశంలో ఏం చేసినా.

చెల్లుబాటు అవుతుంద‌నే ధోర‌ణికి రెడ్ కార్పెట్ ప‌రిచిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube