వెలుగుల పండుగ అయిన దీపావళి.ప్రతీ ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతుందని ప్రజల నమ్మకం.
కాగా, తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రం దీపావళి వెలుగులు నింపడం లేదనే అభిప్రాయం చాలా కాలం నుంచి ఉంది.ఈ సారి కూడా అది ప్రూవ్ అయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గతంలో మాదిరిగానే ఈ సారి కూడా దీపావళి సందర్భంగా విడుదల అయిన సినిమాలు ఏవీ కూడా పెద్దగా ఆకట్టుకులేకపోయాయి.ఈ నేపథ్యంలో ఈ సారీ టాలీవుడ్‌కు దీపావళి సందడి లేదని అంటున్నారు.

మూవీ మేకర్స్ చాలా మంది తమ సినిమాలను దీపావళి సందర్భంగా విడుదల చేయాలని అస్సలు ప్లాన్ చేయరట.ఎందుకంటే దీపావళి సందర్భంగా రిలీజ్ అయ్యే చిత్రాలు పెద్దగా ఆకట్టుకోబోవని వారి సెంటిమెంట్.అయితే, కొవిడ్ నేపథ్యంలో చాలా కాలం పాటు సినిమా షూటింగ్స్ నిలిచిపోవడం, ఇతర కారణాల రిత్యా కొన్ని సినిమాలు దీపావళి సందర్భంగా విడుదలయ్యాయి.అలా ఈ సారి టాలీవుడ్ కు దీపావళి స్పెషల్‌గా వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయనే టాక్ వినబడుతోంది.
మారుతి డైరెక్షన్లో వచ్చిన ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రంలో ఆయన మార్క్ కామెడీ, స్టోరి మిస్ అయిందని టాక్ వినబడుతోంది.ఇక ‘పెద్దన్న, ఎనిమీ’ ఫిల్మ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దీపావళి సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’గా పలకరించే ప్రయత్నం చేశాడు.ఆయన స్టైల్, మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ స్టోరి పరంగా పెద్ద దెబ్బ పడిందనే సినీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సేమ్ ఓల్డ్ స్టోరి అనగా 80ల నాటి రొటీన్ కథను ‘పెద్దన్న’సినిమాలో చూపించడం పెద్దగా నచ్చలేదు.మెలో డ్రామా రజనీకాంత్‌కు అంతగా సూట్ కాలేదనే అభిప్రాయం కూడా ప్రేక్షకుల నుంచి వినబడుతోంది.
మొత్తంగా కథపై సరిగా వర్కవుట్ చేయకుండానే ‘పెద్దన్న’ మూవీని తెరకెక్కించారనే అభిప్రాయం చాలా మంది నుంచి వినబడుతోంది.ఇక ‘ఎనిమీ’ సినిమా లాజిక్ లేని మైండ్ గేమ్‌గా సాగుతుందని ,అది ప్రేక్షకులకు అర్థం కావడం లేదని టాక్.