రిస్క్ తీసుకుంటున్న చిరంజీవి.. జోడీ లేకుండా..?

మెగాస్టార్ చిరంజీవి మారుతున్న కాలానికి అనుగుణంగా రీఎంట్రీలో కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్న సంగతి తెలిసిందే.చిరంజీవి రీఎంట్రీలో హీరోయిన్ కు పెద్దగా ప్రాధాన్యత లేని సినిమా కథలనే ఎంచుకుంటున్నారు.

 No Heroine Role In Chiranjeevi Loosifer Movie Remake, Loosifer Movie, Chiranjeev-TeluguStop.com

ఖైదీ నంబర్ 150 సినిమాలో కాజల్ అగర్వాల్ కొన్ని సీన్లకే పరిమితం కాగా సైరా నరసింహారెడ్డి సినిమాలో సైతం నయనతార పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు.ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని తెలుస్తోంది.

అయితే లూసిఫర్ సినిమా రీమేక్ విషయంలో మాత్రం చిరంజీవి రిస్క్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా హీరోయిన్ ఉండదని సమాచారం.సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే హీరోయిన్ ఖచ్చితంగా ఉండాల్సిందే.అయితే మలయాళంలో లూసిఫర్ సినిమాలో హీరోయిన్ రోల్ ఉండదు.

దీంతో చిరంజీవి సైతం హీరోయిన్ లేకుండానే ఈ సినిమాలో నటించనున్నట్టు తెలుస్తోంది.

Telugu Mohan Raja, Loosifer, Malayalam, Role-Movie

ఈ సినిమాకు మొదట దర్శకునిగా సుజిత్, వీవీ వినాయక్, హరీష్ శంకర్ పేర్లు వినిపించాయి.అయితే కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజాను చిరంజీవి ఫైనలైజ్ చేశారు.ప్రేక్షకుల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగానే చిరంజీవి హీరోయిన్ విషయంలో నిర్ణయం తీసుకున్నారని లూసిఫర్ సినిమాలో హీరోయిన్ పాత్ర ఉంటే పాత్ర ఔచిత్యం దెబ్బ తింటుందని చిరంజీవి భావించారని సమాచారం.

మాతృతకకు పెద్దగా మార్పులు లేకుండానే చిరంజీవి ఈ సినిమా విషయంలో ముందుకెళుతున్నట్టు తెలుస్తోంది.

అయితే హీరోయిన్ లేకుండా సినిమా అంటే రిస్కే అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కంటెంట్ కే ప్రాధాన్యత ఇస్తున్న చిరంజీవి లూసిఫర్ సినిమాతో సక్సెస్ ను అందుకుంటాడో లేదో చూడాల్సి ఉంది.ఈ సినిమాతో పాటు వేదాళం సినిమా రీమేక్ లో చిరంజీవి నటిస్తున్నారు.

వేదాళం రీమేక్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube