అన్ని సోది సినిమాలే.. దసరా వరకు సందడి లేనట్లే

తెలుగు సినిమాకు ఈ సంవత్సరం అంతగా కలిసి వస్తున్నట్లుగా అనిపించడం లేదు.ఈ సంవత్సరం ప్రారంభం అయ్యి అయిదు నెలలు పూర్తి అయ్యింది.

 No Good Movie In Tollywood Up Todussehra-TeluguStop.com

ఇప్పటి వరకు సూపర్‌ హిట్స్‌ ఎన్ని అంటే వేల్ల మీద లెక్క పెట్టవచ్చు.నెలకు ఒక్కటి చొప్పున కూడా సూపర్‌ హిట్‌ చిత్రాలు రాలేదు.

దారుణమైన పరిస్థితిని ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటుంది.భరత్‌ అనే నేను, రంగస్థలం, మహానటి చిత్రాలు ఇంకా రెండు మూడు చిన్న చిత్రాలు పర్వాలేదు అనిపించాయి మినహా విడుదలైన ఇతర చిత్రాలు అన్ని కూడా బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడ్డాయి.

ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో కూడా కనిపించబోతుంది.సంక్రాంతికి విడుదలైన సినిమాలు ఢమాల్‌ అయ్యాయి.కాని దసరాకు రాబోతున్న సినిమాలు మాత్రం బాగుంటాయని అంతా భావిస్తున్నారు.దసరా ముందు వచ్చే చిన్న చితక సినిమాలు అన్ని కూడా అట్టర్‌ ఫ్లాప్‌ ఫ్లాప్‌ అయ్యే విధంగానే కనిపిస్తున్నాయి.

రెండు మూడు పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి.కాని అవి ఏమాత్రం ఆకట్టుకుంటాయో మాత్రం తెలియడం లేదు.తెలుగులో ఇలాంటి పరిస్థితి రావడం చాలా దారుణం అని ఈ సంవత్సరం మొత్తంలో కనీసం పది హిట్‌లు అయినా పడతాయా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

దసరా ముందు రాబోతున్న సినిమాలు అన్ని కూడా సోది సినిమాలే అని, అవి పెద్దగా ఆకట్టుకుంటాయనే నమ్మకం లేదు అంటూ సినీ వర్గాల వారే స్వయంగా అంటున్నారు.

వచ్చే నెలలో రాబోతున్న రెండు సినిమాలు కూడా వాయిదాల మీద వాయిదాలు పడి విడుదల కాబోతున్నాయి.కాబట్టి ఆ సినిమాలు ఖచ్చితంగా ఆకట్టుకోలేవు.ఇక ఆ తర్వాత వచ్చే సినిమాలు కూడా మెప్పిస్తాయనే నమ్మకం లేదు.దసరా ముందు వచ్చే సినిమాల్లో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకుల దృష్టిని అలరించబోతున్నాయి.

భారీ ఎత్తున దసరా సినిమాలు విడుదల కాబోతున్నాయి.

ఎన్టీఆర్‌ హీరోగా సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగాయి.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత చిత్రం దసరాకు విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.టాలీవుడ్‌కు ఈ చిత్రం మాత్రమే తర్వాత సక్సెస్‌ను ఇవ్వబోతుందని సినీ వర్గాల వారు అంటున్నారు.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ కాస్త డల్‌గా ఉంది.ఎప్పుడో విడుదలైన ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘భరత్‌ అనే నేను’ చిత్రాలను మాత్రమే చూస్తున్నారు.

ఈ వారంలో విడుదల కాబోతున్న కాలా చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube