ఓ పక్క ప్రాణ భయం ... మరో పక్క అబద్ధం

ఆంద్ర ప్రదేశ్లో ప్రస్తుతం బాక్సైటు వివాదం రగులుతోంది.దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిక్కుల్లో పడ్డారు.

 No Go On Bauxite Mining Issued-TeluguStop.com

విశాఖపట్నంలోని చింతపల్లి అడవుల్లో అపారమైన బాక్సైటు నిక్షేపాలు ఉన్నాయి.ఈ బాక్సైటు గనులపై బడా పెట్టుబడిదారులు కన్ను వేశారు.

అయితే ఈ గనుల తవ్వకాలను మావోయిస్టులు, కమ్యూనిస్టులు, గిరిజనులు, పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.

అప్పట్లో టీడీపీ కూడా వ్యతిరేకించింది.కానీ ఇప్పుడు బాబు సర్కారు గనుల తవ్వకాని అనుమతిస్తూ జీవో విడుదల చేసింది.

వెంటనే ఉద్యమం మొదలైంది.బాబు ప్రభుత్వంలో పంచాయత్ రాజ్ శాఖ మంత్రి అయిన అయ్యన్న పాత్రుడు విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే.

దీంతో బాక్సైటు తవ్వకాల నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ప్రాణాలు తీస్తామని మావోయిస్టులు అయ్యనను హెచ్చరించారు.జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కూడా చెప్పారు.

దీంతో మంత్రికి ప్రాణ భయం పట్టుకుంది.ఓ పక్క ప్రాణ భయం ఉన్నా మరోపక్క అసలు అలాంటి జీవో ప్రభుత్వం విడుదల చేయలేదని అబద్ధం చెబుతున్నారు.97 నెంబర్ జీవో విడుదల చేసినట్లు మీడియాలో వార్త వచ్చింది.అయ్యన్నకు ఈ సంగతి తెలియదా?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube