కమల్ నాథ్ బలపరీక్ష పై కూడా కరోనా ప్రభావం

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా ప్రభావం మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ బలపరీక్ష పై కూడా పడింది.మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం లో రాజకీయ సంక్షోభం నెలకొనడం తో కమల్ నాథ్ సర్కార్ ఈ రోజు బలపరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది.

 No Floor Test For Kamalnath Government Today-TeluguStop.com

అయితే ఈ కరోనా కారణంగా అసెంబ్లీ లో ఎదురుకోవాల్సిన బలపరీక్ష వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.కరోనా కారణంగా అసెంబ్లీ సమావేశాలను ఈనెల 26 వరకు వాయిదా వేసినట్లు తెలుస్తుంది.

ఆయన నేడు ఫ్లోర్ టెస్టును ఎదుర్కొనేలా చూడాలని గవర్నర్ లాల్ జీ టాండన్.స్పీకర్ ప్రజాపతికి లేఖ రాశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా ఈ పార్టీని వీడి బీజేపీలో చేరడంతో.ఆయనకు మద్దతుదారులైన వీరంతా ఎలాంటి చర్య చేపట్టబోతారోనని రాజకీయ పరిశీలకులు తర్జనభర్జన పడుతున్నారు.22 మంది రెబెల్ ఎమ్మెల్యేలను బీజేపీ బందీలుగా ఉంచిందని, అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నదే వారి ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.అయితే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టనివ్వండి.

అని సవాల్ చేసిన ఆయన.తమ ప్రభుత్వం శాసన సభలో నెగ్గితీరుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.రెబెల్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.వీలైతే ఫ్లోర్ టెస్ట్ ను వాయిదా వేయాలని కోరుతున్నామన్నారు.మరోపక్క కరోనా ప్రభావం కూడా పడడం తో అసెంబ్లీ ని ఈ నెల 26 కు వాయిదా వేయడం తో ఇక ఈ బలపరీక్ష కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తుండడం తో కమలనాథ్ సర్కార్ కు ఊరట లభించనుంది.సింధియా వర్గంలోని ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఇటీవల స్పీకర్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే.దీంతో ప్రస్తుతం అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 222కు పడిపోయింది.

112 మంది మద్దతు తెలిపితేనే కమల్‌నాథ్‌ గట్టెక్కుతారు.వారిలో 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించనందున కాంగ్రెస్‌ బలం 108 మందిగా ఉన్నది.ఇప్పటికే బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ఇప్పటికే బీజేపీ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను కలుసుకున్నారు.మరో నలుగురు స్వ తంత్రుల మద్దతు ఎటువైపు అన్నది కీలకంగా మారింది.

మరి ఒకవేళ బలపరీక్ష నిర్వహించినా కమల్ నాథ్ సర్కార్ గట్టెక్కుతుందా లేదా అన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube