అమెరికా లో సిక్కు యువకుడికి అవమానం

అగ్రరాజ్యం అమెరికా లో సిక్కు వ్యక్తి కి తీవ్ర అవమానం ఎదురైంది.తలపాగా ధరించిన ఒక్క కారణంగా ఆ యువకుడిని బార్ లోకి అనుమతించకపోవడం జాత్యహంకారానికి నిదర్శనం గా చెప్పుకోవాలి.

 No Entry For The Sick Boy In The Bar Because Of Wearing Turban-TeluguStop.com

వివరాల్లోకి వెళితే….గురువీందర్ గ్రేవేల్ అనే యువకుడు అర్ధరాత్రి దాటిన తరువాత తన స్నేహితుడు ని కలుసుకోవాలని ఫోర్ట్ జఫర్సన్ లోని హార్బర్ గ్రిల్ అనే బార్ కి వెళ్ళాడు.

అయితే నెత్తిపై తలపాగా ఉన్న కారణంగా ఆ యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నట్లు అక్కడి మీడియా కూడా పేర్కొంది.అయితే ఇది మా సంప్రదాయం లోపలి కి అనుమతివ్వమని మేనేజర్ కి విన్నవించుకున్నా కూడా ఆ యువకుడి ని లోపలికి వెళ్లనీయకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నట్లు గురువీందర్ తెలిపాడు.

అయితే ఈ ఘటన కొద్దీ సేపటి తరువాత హార్బర్ గ్రిల్ బార్ దీనిపై వివరణ ఇచ్చుకుంది.ఆ విధంగా జరిగినందుకు గురువీందర్ కు ఫేస్ బుక్ ద్వారా క్షమాపణలు కూడా తెలిపింది.

శుక్రవారం,శనివారం లలో రాత్రి పది గంటల తరువాత టోపీలు,హ్యట్లు ధరించడం పై నిషేధం విధించామని బార్ వివరణ ఇచ్చింది.అయితే కేవలం టోపీలు,హ్యాట్ లపైనే నిషేధం ఉంది కానీ సంప్రదాయంగా ధరించే వాటిపై ఎలాంటి నిషేధం లేదని,గురువీందర్ విషయం అలా జరిగినందుకు క్షమాపణలు కోరుతున్నట్లు హార్బర్ గ్రిల్ బార్ ఫేస్ బుక్ ద్వారా తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube