ఆమెకు బ్యాడ్‌, ఫ్యాన్స్‌కు గుడ్‌... జబర్దస్త్‌కు ఎలాంటి ఢోకా లేదు  

No Doubts For Etv Jabardsth Program-

తెలుగు ప్రేక్షకులతో పెనవేసుకు పోయిన కామెడీ షో జబర్దస్త్‌.ఎంతగా అంటే ఈటీవీలో ప్రసారం అయ్యే ఎపిసోడ్‌ మిస్‌ అయితే వెంటనే తెల్లారి లేదా ఆ తర్వాత ఎప్పుడైనా ఖచ్చితంగా యూట్యూబ్‌లో చూస్తారు.అలాంటి జబర్దస్త్‌లో గత కొన్ని రోజులగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి...

No Doubts For Etv Jabardsth Program--No Doubts For ETV Jabardsth Program-

జబర్దస్త్‌లో యాంకర్స్‌ నిలకడగా ఉంటున్నా కూడా జడ్జ్‌లు మాత్రం మారుతూ వస్తున్నాయి.ఎన్నికల కారణంగా నాగబాబు మరియు రోజాలు ఇద్దరు కూడా జబ్దస్త్‌కు దూరం అయ్యారు.

దాదాపు రెండున్నర నెలల తర్వాత రోజా ఆ తర్వాత నాగబాబు రీ ఎంట్రీ ఇచ్చారు.

No Doubts For Etv Jabardsth Program--No Doubts For ETV Jabardsth Program-

అయితే ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా రోజా మంత్రి అవ్వడం ఖాయం అనుకున్నారు.రోజా మంత్రి అయితే నాగబాబు పక్కన కూర్చునేది ఎవరు, ఏ మేరకు ఆకట్టుకుంటారు అని అంతా అనుమానాలు వ్యక్తం చేశారు.ఈ సమయంలోనే రోజాకు మొండి చేయి చూపించిన జగన్‌ ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేను అంటూ చేతులు ఎత్తేశాడు.

మంత్రిగా రోజా ప్రమాణ స్వీకారం చేస్తుందని అంతా భావిస్తే, ఆమె వెళ్లి ప్రమాణ స్వీకారం చేస్తున్న మంత్రులకు క్లాప్స్‌ కొట్టి వచ్చింది.మంత్రి పదవి రాని రోజా వందకు వంద శాతం జబర్దస్త్‌ను వదిలేయదు అంటూ బుల్లి తెర వర్గాల వారు అంటున్నారు.దాంతో నాగబాబు రోజాల కాంబో అలాగే కంటిన్యూ అవ్వబోతుంది.ఆది అన్నట్లుగా ఆకాశంలో సూర్య చంద్రలు ఎలాగో జబర్దస్త్‌కు నాగబాబు రోజాలు అలాగా, వారిద్దరు లేకుంటే జబర్దస్త్‌కు అంత సీన్‌ లేదు.

ఇన్ని రోజులుగా వచ్చిన అలీ, శేఖర్‌ మాస్టర్‌, మీనా ఎవరు కూడా వారి స్థానంను భర్తీ చేయలేక పోయారు.వారు వచ్చిన సమయంలో టీఆర్పీ రేటింగ్‌ కూడా తగ్గిందని తెలుస్తోంది.మళ్లీ ఇద్దరి రీ ఎంట్రీతో జబర్దస్త్‌ కామెడీ ఖాయం...