ఈ మాత్రం దానికి బెనిఫిట్ షో దేనికి ?

బెనిఫిట్ షో అనే పేరు వినే ఉంటారు కదా .తోలి రోజు ఉదయం ఆటకు ముందు వేసే స్పెషల్ షో .

 No Demand For Sai Dharam Tej’s Benefit Show-TeluguStop.com

సినిమా టికెట్ రేట్ కి పదింతలు ఎక్కువ రేట్లకి టికెట్స్ అమ్ముతుంటారు.మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలకి రెండు వేలకు తగ్గదు టికెట్ ధర .వాళ్ళకంటే లక్షల్లో అభిమానులున్నారు … వేలు పెట్టి టికెట్ కొనే వేర్రిమాలోకాలు ఉన్నారు .మరి సాయి ధరం తేజ్ కి ఎవరున్నారు ? ఏం చూసుకొని సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కి బెనిఫిట్ షో వేయించారు ?

ఎంత మెగాహీరో అయినా, పవన్ కి, చరణ్ కి పెట్టినట్టు వెయ్యి రూపాయలు పెట్టి సినిమా చూడటం కష్టం కదా .ఇవన్ని గాలికొదిలేసి పట్టుబట్టి బెనిఫిట్ షో వేయించుకున్నారు సాయి ధరం తేజ్ సన్నిహితులు.హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో రేపు ఉదయం ఈ షో స్క్రీనింగ్ చేస్తారు.

టికెట్స్ కి డిమాండ్ లేక, ప్రముఖ వెబ్ సైట్స్ కి టికెట్స్ ఇచ్చి, వాళ్లతో కాంటెస్ట్ పెట్టించి ఫ్రీ గా టికెట్స్ ఇస్తున్నారు .ఈ రకంగా బెనిఫిట్ షో కొన్న పంపిణిదారుడికి నష్టమే కదా ! నితిన్ లాంటి హీరోకే బెనిఫిట్ షో లేనప్పుడు సాయి ధరం తేజ్ కి ఎందుకట ? బెనిఫిట్ షో అని పెట్టి ఇలా చేతులు కాల్చుకోవడం దేనికటా !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube