వర్మ ముందు చిన్నబోయిన కరోనా  

No Corona Effect On Ram Gopal Varma - Telugu Climax Movie, Corona Virus, Mia Malkova, Ram Gopal Varma, Rgv

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తూ తన ప్రతాపం చూపుతుండటంతో అన్ని రంగాలకు చెందిన పనులు స్తంభించిపోయాయి.కాగా ఈ కరోనా వైరస్‌ను ఏమాత్రం లెక్కచేయకుండా తన పని తాను కానిచ్చేస్తున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.

 No Corona Effect On Ram Gopal Varma

గతంలో శృంగార తార మియా మాల్కోవాతో వర్మ సృష్టించిన సంచలనం ‘గాడ్,సెక్స్ అండ్ ట్రూత్’ గురించి అందరికీ తెలిసిందే.ఇప్పుడు మరోసారి అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ మియా మాల్కోవాతో క్లైమాక్స్ అనే సినిమాను తెరకెక్కించాడు ఈ డైరెక్టర్.

కరోనా సమయంలోనే ఈ సినిమా షూటింగ్ ముగించేశాడు వర్మ.కేవలం సినిమాను పూర్తి చేయడమే కాకుండా ఇటీవల టీజర్, ట్రైలర్లు కూడా రిలీజ్ చేసాడు వర్మ.కాగా ఇప్పుడు మరో సంచలనం క్రియేట్ చేస్తూ వర్మ ఏకంగా ఈ సినిమాను రిలీజ్ కూడా చేస్తున్నాడు.తనకు సంబంధించిన RGVWorldTheatre లో వర్మ ఈ సినిమాను జూన్ 6న రాత్రి 9 గంటలకు రిలీజ్ చేసేందుకు వర్మ పక్కా ప్రణాళిక రూపొందించాడు.ఇక ఈ సినిమాను చూసేవారు రూ.100 చెల్లించాల్సి ఉంటుందని, చూసేందుకు వీలుగా లాగిన్ ఐడీలు ఇస్తామని వర్మ చెప్పుకొచ్చాడు.

వర్మ ముందు చిన్నబోయిన కరోనా-Gossips-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ట్రైలర్‌ను శనివారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తానంటూ వర్మ చెప్పాడు.మియా మాల్కోవా ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా పూర్తి థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన్నట్లు టీజర్, ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.

మరి ఈ సినిమాతో వర్మ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.క్లైమాక్స్ చిత్రాన్ని ప్రేక్షకులు క్లైమాక్స్ వరకు చూస్తారా లేక మధ్యలోనే వదిలేస్తారా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

No Corona Effect On Ram Gopal Varma Related Telugu News,Photos/Pics,Images..

footer-test