ఇల్లు అద్దెకి కావాలా... అయితే కరోనా లేదని సర్టిఫికేట్ కావాలి

కరోనా వైరస్… ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న ఈ పేరుతో వైద్యరంగం మొత్తం పరిశోధనల మీద దృష్టిపెట్టింది.బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్లో ఆ కొరింగా కరోనా అయితే దీని కారణంగా కోటి మంది ప్రజలు లేచిపోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.

 No Corona Certificate Need For Rental House In Hyderabad-TeluguStop.com

ఇక దీనికి ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు మెడిసన్ కనిపెట్టలేకపోయారు.ఎప్పుడు తమ వైద్యశాస్త్రం గొప్ప అని చెప్పుకునే వారు కూడా మెడిసన్ కనిపెట్టలేక చేతులు ఎత్తేస్తున్నారు.

ఇక కరోనా వైరస్ మెల్లగా అన్ని దేశాలకి విస్తరిస్తుంది.ఇక ఇండియాలో కూడా కరోనా పోజిటివ్ కేసులు 50 దాటినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది.

అయితే ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉంది.అంత వేగంగా విస్తరించడం లేదు.దీనికి కారణాలుగా ఇండియన్స్ బాడీ కండిషన్ కి కరోనాని ఎదుర్కొనే శక్తి ఉందని, మనం తీసుకునే ఆహార విధానం కరోనా బారి నుంచి మనల్ని కాపాడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇదిలా ఉంటే కరోనా భయంతో హైదరాబాద్ లో కొత్తవారికి ఇల్లు అద్దెకి ఇవ్వడం కూడా మానేస్తున్నారు.

మహేంద్ర హిల్స్ ప్రాంతంలో ఇల్లు అద్దె కోసం వెళ్ళిన వారికి వింత అనుభవం ఎదురైంది.కరోనా సోకలేదని మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఇల్లుడు అద్దెకి ఇస్తామని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

ఈ పద్ధతి మిగిలిన ప్రాంతాలకి కూడా విస్తరించడంతో బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఇల్లు అద్దెకి కావాలంటే గాంధీ హాస్పిటల్ కి వెళ్లి మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube