డీల్ కుదుర్చుకున్న అగ్ర హీరోలు

చిన్న సినిమాలకు పర్వాలేదు లేదు కాని పెద్ద సినిమాలు పోటిపడితే చాలా కష్టం.ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు పడితే థియేటర్లు సరిపోవు.

 No Clash Between Pawan, Mahesh And Allu Arjun-TeluguStop.com

అలాంటి పరిస్థితి రాకుండా సమస్యను సామరస్యంగా పరీష్కరించుకున్నారు మన టాప్ హీరోలు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సంక్రాంతి బరిలోంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రాన్ని ఫిబ్రవరి కల్లా పూర్తీ చేసి మర్చి 24 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.నిజానికి బన్ని సరైనోడు అప్పుడే రావాలి.

కాని పెద్ద సినిమాల మమధ్య గ్యాప్ ఉండేలా సరైనోడు ని ఏప్రిల్ రెండోవ వారానికి షిఫ్ట్ చేసారని టాక్.ఆ లెక్కన సర్దార్ ఓపెనింగ్స్ కే కాదు.

లాంగ్ రన్ కి కుడా ఎలాంటి అడ్డుగోడ ఉండదు.

ఇక బన్ని ఏప్రిల్ రెండోవ వారంలో వస్తోంటే, దానికి రెండు వారాల తరువాత మహేష్ బాబు బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి.

అవును ఏప్రిల్ చివరి వారంలో బ్రహ్మోత్సవం రానుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.మహేష్ పోకిరి ఏప్రిల్ చివర్లో వచ్చింది కాబట్టి ఈసారి కుడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతారట.

ఇలా ఆ ముగ్గురు హీరోలు తమ చిత్రాల గ్యాప్ ఉంచుకునేలా చేసింది అల్లు అరవింద్ అని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఏది ఏమైతే ఏమి, మొత్తానికి వేసవి సెలవుల్లో తెలుగు ప్రేక్షకులకి వినోదమే వినోదం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube