పొత్తు పొడిచిందా లేదా ? కాస్త క్లారిటీ ఇవ్వండయ్యా !

జగన్ ఢిల్లీకి వెళ్లారు .వచ్చారు.

 Janasena Party In Confusion With Ycp Bjp Alliance, Ycp, Bjp, Ap Special Status,-TeluguStop.com

అక్కడ కేంద్ర బిజెపి పెద్దలను కలిసి అన్ని విషయాల పైన చర్చించారు.అక్కడితో ఆయన పని అయిపొయింది.

అయితే అసలు అక్కడ ఏం జరిగింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మారిపోయింది.ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత జగన్ ఎప్పటిలాగానే సైలెంట్ అయిపోయారు.

అసలు ఈ భేటీలో ఏం జరిగింది అనేది చెప్పేందుకు నోరు విప్పలేదు.పోనీ కేంద్ర బీజేపీ పెద్దలు ఏమైనా చెప్తారా అంటే వారు నోరు విప్పలేదు.

దీంతో అసలు జగన్ మోదీ మధ్య జరిగిన చర్చ ఏమిటో ఎవరికీ స్పష్టమైన క్లారిటీ లేదు.అయితే జాతీయ మీడియా, తెలుగు మీడియా మాత్రం రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.

రెండు మూడు మంత్రి పదవులు కేంద్ర క్యాబినెట్ లో వైసీపీ కి దక్క పోతున్నాయని, ఇలా ఎన్నో రకాలుగా ప్రచారం జరిగిపోయింది.

రేపోమాపో వైసీపీలోని జగన్ కు అత్యంత సన్నిహితులైన మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి వంటి వారికి మంత్రి పదవులు వచ్చేస్తున్నాయ్ అంటూ ప్రచారం మొదలయ్యింది.

బిజెపి, వైసిపి మధ్య పొత్తు సెట్ అయ్యిందా లేదా అనే విషయం ఎవరికీ క్లారిటీ లేదు.ఈ విషయంలో జగన్ కానీ, ఇటు బీజేపీ పెద్దలు కానీ, ఎవరూ గుట్టు విప్పడం లేదు.

దీంతో ఎవరి ఊహాగానాల్లో వారు ఉన్నారు.బిజెపి విషయానికి వస్తే, ఏపీలో జనసేన పార్టీతో ఆ పార్టీ పొత్తు పెట్టుకుంది.

కలిసి ఎన్నికలకు వెళ్లడంతో పాటు, వైసీపీ ప్రభుత్వంపై రాజీ లేకుండా పోరాడేందుకు దసరాకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నాయి.

ఒక కార్యాచరణ రూపొందించుకునే నిమిత్తం ఒక కమిటీని సైతం రెండు పార్టీలు ఏర్పాటు చేసుకున్నాయి.

ఈ సమయంలో వైసీపీతో బీజేపీ కనుక పొత్తు పెట్టుకుంటే, తప్పనిసరిగా జనసేనకు తెలియజేయాల్సి ఉంటుంది.ఎందుకంటే ఇది పొత్తు ధర్మం.అసలు బీజేపీ వైసీపీ కలిసి ముందుకు వెళ్లడం ద్వారా, ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా, ఎన్నికల సమయంలో మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది.జనసేన తో కలిసి పోటీ చేద్దాం అని చూస్తున్నా, బిజెపి, వైసిపి ఇచ్చే సీట్లపైనే ఆధారపడాల్సి ఉంటుంది.

అంటే పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీకి పోటీ చేసే అవకాశం ఉండదు.

కేవలం వైసీపీ కేటాయించిన సీట్లను తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

ఇటువంటి వ్యవహారాలకు బిజెపి ఒప్పుకుంటుందా ? ఒప్పుకుంటే జనసేన పరిస్థితి ఏమిటి అనేది కూడా చర్చకు వస్తోంది.కేంద్రంలో వైసీపీ సహకారం బీజేపీకి అత్యవసరం.

ఈ పరిస్థితుల్లో జగన్ దగ్గర చేసుకునేందుకు బిజెపి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది.కాకపోతే రానున్న రోజుల్లో ఈ వ్యవహారం, ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదు.

అసలు ఈ వ్యవహారాలపై ఒక క్లారిటీ రావాలంటే, తప్పనిసరిగా బిజెపి, వైసిపి ల మధ్య ఉన్న బంధం ఏమిటో ? పొత్తు ఉందా లేదా అనే విషయంపై, అటు అధికారికంగా వైసిపి, బిజెపి క్లారిటీ ఇవ్వాల్సిందే.కానీ ఎందుకో ఈ విషయంలో రెండు పార్టీల అగ్రనేతలు మౌనంగా ఉండిపోవడంతో, ఎవరికి వారు తమకు తోచిన విధంగా బిజెపి వైసిపిల మధ్య ఉన్న బంధం పై గాసిప్స్ పుట్టిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube