కోదండరాం రాజకీయ భవిష్యత్తుపై నో క్లారిటీ.. అసలు కారణం ఇదేనా?

No Clarity On The Political Future Of Kodandaram Is This The Real Reason

తెలంగాణ  రాష్ట్రం ఏర్పడటానికి చాలా మంది పోరాటం చేశారు.ఎంతో మంది తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పరిస్థితి ఉంది.

 No Clarity On The Political Future Of Kodandaram Is This The Real Reason-TeluguStop.com

అయితే తెలంగాణ ఏర్పడటంలో కోదండ రాం ఎంతటి కీలక పాత్ర పోషించారో కొత్తగా చెప్పనక్కరలేదు.అయితే జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణలో ఉన్న అన్ని రకాల వర్గాలను ఏకం చేసి తెలంగాణను సాధించడానికి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

అయితే తరువాత కెసీఆర్ తో విభేదించి తెలంగాణ జనసమితి పార్టీ ఏర్పాటు చేసినా రాజకీయంగా అంతగా విజయం సాధించలేదు.  ఎమ్మెల్సీగా పోటీ చేసినా ఓటమి పాలయ్యారు.

 No Clarity On The Political Future Of Kodandaram Is This The Real Reason-కోదండరాం రాజకీయ భవిష్యత్తుపై నో క్లారిటీ.. అసలు కారణం ఇదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాజకీయ పార్టీ కూడా ఎటువంటి కార్యవర్గం లేకుండానే క్షేత్ర స్థాయిలో కూడా అంతగా కార్యకర్తలు లేకుండానే పార్టీని కోదండరామ్ నడిపిస్తున్న పరిస్థితి ఉంది.  ప్రస్తుతం కోదండరాం రాజకీయ భవిష్యత్తుపై ఎటువంటి క్లారిటీగా లేని పరిస్థితి ఉంది.

రాజకీయంగా ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితి ఉంది.

ఇక మరో రెండున్నరేళ్లలో  సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో కోదండరాం ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తారనేది రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఆసక్తిగా మారింది.

అయితే కోదండరామ్ మౌనం వహిస్తుండటంతో  రాజకీయాల నుండి నిష్క్రమిస్తారా లేక వేరే పార్టీతో పొత్తు పెట్టుకుంటారా లేక పోటీలోఉంటారా ఉండరా అనే విషయంపై అంతగా క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఉంది.ప్రస్తుతం ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పోయిస్తే తెలంగాణ జనసమితికి అంతగా ప్రజల్లో ఆదరణ లేదనే చెప్పాలి.

Telugu Bjp, Kodandaram, Telenganajana, Telengana, Tjs, Trs, Ts Potics-Political

దానికి ముఖ్య కారణం రాజకీయంగా ఏది చేయాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న పని.ఇంతటి ఖరీదైన రాజకీయాల్లో కోదండరాం నెగ్గుకరాగలడా అంటే కాస్త కష్టమనే చెప్పవలసి ఉంటుంది.ఏది ఏమైనా తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తిగా చరిత్రలో కోదండరాం పేరు  మాత్రం నిలిచిపోయి ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

#Potics #Tjs #TelenganaJana #Bjp #Telengana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube