శర్వానంద్ సినిమా రిలీజ్ ఉందా లేదా?

టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న శర్వానంద్, ప్రస్తుతం శ్రీకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమాను పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథతో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కిషోర్ రెడ్డి.

 No Clarity On Sharwanand Sreekaram Release, Sharwanand, Sreerakaram, Tollywood N-TeluguStop.com

ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు హీరో శర్వానంద్.క్లాస్, మాస్ ప్రేక్షకులు మెచ్చే కథనం ఈ సినిమాలో ఉండబోతుందని చిత్ర యూనిట్ ముందునుండీ చెబుతూ వస్తోంది.
ఇక ఈ సినిమాలోని ‘భలేగుంది బాలా’ అనే పాట ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి కావడంతో ఈ సినిమాను ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కానీ ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు శర్వానంద్ ఏమాత్రం ఆసక్తి చూపడం లేదట.

ఆయన నటించిన జాను చిత్రం గతేడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి ఫ్లాప్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.
దీంతో ఇప్పుడు ‘శ్రీకారం’ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు శర్వానంద్ ఏమాత్రం ఆసక్తి చూపడం లేదట.

మరి శ్రీకారం చిత్రాన్ని శర్వానంద్‌కు ఇష్టం లేకపోయినా ఫిబ్రవరి నెలలోనే రిలీజ్ చేస్తారా లేక మార్చికి వాయిదా వేస్తారా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.ఇక ఈ సినిమాలో శర్వానంద్ ఓ పల్లెటూరి యువకుడి పాత్రలో నటిస్తున్నాడు.

కాగా ఆయన సరసన హీరోయిన్‌గా ‘గ్యాంగ్‌లీడర్’ ఫేం ప్రియాంక ఆరుల్ మోహన్ నటిస్తోంది.మరి ఫిబ్రవరిలో శ్రీకారం చిత్రం రిలీజ్ ఉందా లేదా అనే డౌట్‌కు చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube