నిఖిల్ సినిమా ఇప్పట్లో లేనట్లే?  

No Clarity On Nikil Arjun Suravaram-mudra Movie,nikil,nikil Arjun Suravaram

స్వామి రారా సినిమా తరువాత తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను సెట్ చేసుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్. ఆ సినిమా తరువాత నిఖిల్ ఎంచుకున్న కథలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. కార్తికేయ – ఎక్కడికి పోతావు చిన్నవాడ – కేశవ సినిమాలు ఈ యువ హీరో కెరీర్ కి స్ట్రాంగ్ ఎనర్జీని ఇచ్చాయి..

నిఖిల్ సినిమా ఇప్పట్లో లేనట్లే?-No Clarity On Nikil Arjun Suravaram

అయితే గత ఏడాది కిర్రాక్ పార్టీ సినిమాతో నిఖిల్ ఊహించని డిజాస్టర్ అందుకున్నాడు. చిరాక్ పార్టీ అని నెగిటివ్ కామెంట్స్ కూడా అందుకున్నాడు.

ఇక ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని తమిళ్ సినిమా కనిథన్ రీమేక్ అర్జున్ సురవరంతో రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమా మొదటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటోంది..

మొదట ముద్ర అనే టైటిల్ ను సెట్ చేసిన సంగతి తెలిసిందే.

ఆ తరువాత పలు వివాదాలతో అర్జున్ సురవరంగా పేరును మార్చారు. అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా గత కొన్ని వారాలుగా వాయిదా పడుతూ వస్తోంది. రెండు నెలల క్రితం నిఖిల్ సినిమా కోసం రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు.

అయితే ఇప్పటికి కూడా రిలీజ్ విషయంలో క్లారిటీ లేదు. ఎడిటింగ్ వర్క్ వల్ల లెట్ అవుతుందని కొన్ని రూమర్స్ వస్తుంటే. లేదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని మరికొన్ని రూమర్లు వైరల్ అవుతున్నాయి. మరి నిఖిల్ అర్జున్ సురవరం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.