కార్తికేయ సీక్వెల్‌లో హీరోయిన్ ఎవరు బాసు?

యంగ్ హీరో నిఖిల్ నటించిన కెరీర్ బెస్ట్ మూవీ కార్తికేయ ఆ సమయంలో ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు చందూ ముండేటి తెరకెక్కించగా, పూర్తి థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు.

 No Clarity On Karthikeya 2 Heroine-TeluguStop.com

ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది.కాగా ఈ సినిమాలో నిఖిల్ పర్ఫార్మెన్స్‌కు మంచి ప్రశంసలు దక్కాయి.

అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే వెల్లడించారు చిత్ర యూనిట్.
ఈ క్రమంలో ఈ సినిమా సీక్వెల్‌ను గతేడాది ప్రకటించినా, కరోనా కారణంగా సినిమాను ప్రారంభించలేదు.

అయితే ఇటీవల ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించారు చిత్ర యూనిట్.కాగా ఈ సినిమాలో నిఖిల్ పాత్ర మరోసారి ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.గతంలో కార్తికేయ చిత్రంలో బబ్లీ బ్యూటీ స్వాతి రెడ్డి నటించగా, నిఖిల్‌తో ఆమె కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉందని అందరూ అన్నారు.

అయితే ప్రస్తుతం ఆమె వివాహం చేసుకున్న తరువాత సినిమాలు చేయడం లేదు.దీంతో కార్తికేయ-2 చిత్రంలో ఎవరు హీరోయిన్‌గా నటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.కానీ నిఖిల్ నటిస్తున్న మరో చిత్రం ‘18 పేజీస్’ చిత్రంలో కూడా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో కార్తికేయ-2 చిత్రంలో ఆమె నటిస్తుందా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఏదేమైనా కార్తికేయ-2 చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube