నందమూరి అభిమానులకు ట్రీట్ ఎప్పుడో చెప్పు బాలయ్య?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గురించిన అప్‌డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆశగా చూస్తున్నారు.

 No Clarity On Balakrishna Movie Title, Balakrishna, Boyapati Sreenu, Tollywood N-TeluguStop.com

ఇక ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ హిట్ కొట్టేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమా మొదలై చాలా రోజులు అవుతున్నా, ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి అప్‌డేట్స్ చిత్ర యూనిట్ నుండి రావడం లేదు.దీంతో ఈ సినిమా నుండి ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గతంలో ఈ సినిమా పోస్టర్స్, ఆ తరువాత టీజర్ మాత్రమే రిలీజ్ కాగా, ఇప్పటివరకు టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు చిత్ర యూనిట్.దీంతో ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఇదేనంటూ పలు పేర్లు వినిపిస్తున్నా, వాటిని చిత్ర యూనిట్ మాత్రం అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు.

దీంతో ఈ సినిమా టైటిల్‌ను వీలైనంత త్వరగా అనౌన్స్ చేస్తే బాగుంటుందని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు అంటున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగా, ఈ సినిమా టైటిల్ ఏమై ఉంటుందా, ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేస్తుందా అని అందరూ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా, ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube