పవన్ తెలంగాణ రాజకీయం ! అస్సలు క్లారిటీ రావడంలేదేంటి ?  

No Clarity Given By Pawan Kalyan Based On Telangana Politics-nalamala Forest Ureniyam Issue,pawan Kalyan,telangana Cm Kcr

ఏపీ రాజకీయాల్లో దూకుడుగా వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మీద దృష్టిపెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.తెలంగాణాలో జనసేన ఉనికే లేని పరిస్థితుల్లో పవన్ ఈ విధంగా ముందుకు వెళ్లడం ఎవరికీ అంతుపట్టడంలేదు.తాజాగా కాంగ్రెస్ నేత వి...

No Clarity Given By Pawan Kalyan Based On Telangana Politics-nalamala Forest Ureniyam Issue,pawan Kalyan,telangana Cm Kcr-No Clarity Given By Pawan Kalyan Based On Telangana Politics-Nalamala Forest Ureniyam Issue Pawan Cm Kcr

హనుమంతరావు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్‌ను వెళ్లి స్వయంగా కలిశారు.దీంతో తెలంగాణలో కొత్త సమీకరణాలు తెరమీదకు వచ్చాయి.పవన్ కూడా జనసేన తరపున ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం అన్నట్టుగా వ్యవహరించడంతో ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటి వరకు పవన్ తెలంగాణ వ్యవహారాలను చూసీ చూడనట్లుగా వదిలేశారు.అంతే కాదు ఒకదశలో టీఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా మెలిగారు.స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ పవన్ ఆయనతో సమావేశం అయ్యారు.

No Clarity Given By Pawan Kalyan Based On Telangana Politics-nalamala Forest Ureniyam Issue,pawan Kalyan,telangana Cm Kcr-No Clarity Given By Pawan Kalyan Based On Telangana Politics-Nalamala Forest Ureniyam Issue Pawan Cm Kcr

ఇక ఆ తరువాత ఫోకస్ అంతా ఏపీ మీదే పెట్టారు.ఇప్పుడు ఏపీలో జనసేనను మరింత బలోపేతం చేసే పనిలో ఉండగానే ఇప్పుడు తెలంగాణ మీద ఫోకస్ చేయడం ఒక్కసారిగా పవన్ వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.

ఆ తరువాత కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావుతో భేటీ అయ్యారు.అంతే కాదు టాలీవుడ్ లో చిరకాలంగా ఉన్న సినిమా కళాకారుల ఇళ్ల సమస్యపై పవన్ స్పందించారు.తాజాగా సినిమా ఇండ్రస్ట్రీ కి చెందిన కొంతమంది కీలక వ్యక్తులతో భేటీ అయ్యారు...

సినిమా కళాకారులకు స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ వ్యవహారాల్ల్ని చూస్తుంటే పవన్ మెల్లిమెల్లిగా తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడుతున్నట్టుగానే కనిపిస్తోంది.ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత టీడీపీ పరిస్థితి దారుణంగా దిగజారింది.

ఈ మధ్యనే అక్కడ పార్టీని యాక్టివ్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.ఇటువంటి నేపథ్యంలో పవన్ తెలంగాణ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ప్రయత్నిస్తుండడం చూస్తుంటే తెరవెనుక ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తోంది.

ఇటీవల యూరియా కొరతకు సంబంధించిన విషయంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరిపై పవన్ విమర్శలు చేశారు.ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ కి సంబంధించి పవన్ తీసుకున్న స్టాండ్ ఏమిటి అనేది ఎవరికీ క్లారిటీ రావడంలేదు.అలా అని పవన్ కూడా ఈ విషయంలో తన వైకిరి ఏంటో కూడా స్పష్టంగా చెప్పకుండా అందరిని సందిగ్ధంలో పెట్టేస్తున్నారు...

ముందు ముందు పవన్ ఏ ఏ విషయాల మీద స్పందిస్తోరో, ఎటువంటి పోలికలు స్టేట్మెంట్స్ ఇస్తారో తెలిస్తే కానీ పవన్ తెలంగాణ పాలిటిక్స్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపించేలా లేదు.