ఆది పురుష్ లో సీత కథ ఇంకా ముగిసినట్లు లేదు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్ లో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా ఆది పురుష్.మైథలాజికల్ కథాంశం అయిన రామాయణం ఆధారంగా ఈ సినిమాని కంప్లీట్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

 No Clarification On Adipurush Heroine-TeluguStop.com

ఓం రౌత్ దర్శకత్వంలో ఏకంగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో టి-సిరీస్ ఈ సినిమాని నిర్మిస్తుంది.ఇందులో రాముడు పాత్రలో ప్రభాస్ నటిస్తూ ఉండగా లంకేష్ రావణుడుగా సైఫ్ ఆలీఖాన్ సందడి చేయబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపొయింది.ముంబైలో ఓ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ గ్రీన్ మ్యాట్ లో జరుగుతుంది.

 No Clarification On Adipurush Heroine-ఆది పురుష్ లో సీత కథ ఇంకా ముగిసినట్లు లేదు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ప్రభాస్ కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో అన్ని పాత్రలకి సంబంధించి క్యాస్టింగ్ ఫైనల్ అయినట్లు తెలుస్తుంది.

అయితే హీరో, విలన్ పాత్రలని తప్ప ఇతర తారాగణం గురించి చిత్ర యూనిట్ ఇప్పటి వరకు రివీల్ చేయలేదు.ముఖ్యంగా సినిమాలో సీత పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనే విషయాన్ని బయట పెట్టలేదు.

రామాయణంలో సీత పాత్ర అనేసరికి చాలా హెవీగా అంచనాలు ఉంటాయి.ఆ అంచనాలని అందుకోవాలంటే ఈ జెనరేషన్ ఉన్న హీరోయిన్స్ లలో ఎవరి వళ్ళ అవుతుందనేది చెప్పలేని విషయం.

భారతీయులు ఆ సీత పాత్రకి ఓ విధంగా మనసులో ముద్ర వేసుకున్నారు.వారి ఆలోచనలకి రీచ్ అవ్వకుండా ఉంటే అసలుకే ఇబ్బంది అవుతుంది.

ఈ నేపధ్యంలో సీత పాత్రని రివీల్ చేయడం లేదనే టాక్ వినిపిస్తుంది.ఇందులో ఆ పాత్ర కోసం కృతి సనన్ ని ఫైనల్ చేశారని.

ఆమె ఇప్పటికే షూటింగ్ లో పాల్గొందనే టాక్ వినిపిస్తుంది.

#Saif Ali Khan #Darling Prabhas #Krithi Sanon #Om Raut

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు