గుడ్ న్యూస్: రేపటి నుంచి బోర్డర్ ‌లో ఇక తనిఖీల్లేవ్ ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.రేపటి నుంచి అనగా జూన్ 8 తారీకు నుండి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు చెక్ పోస్టులను పూర్తిగా ఎత్తి వేస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.

 No Checking In Andhra Telangana Border, Lockdown, Corona Effect, Apsrtc,buses-TeluguStop.com

కాకపోతే కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ సడలింపులో భాగంగా ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలకు అనుమతించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయాన్ని ప్రజలకు తెలిపింది.

ఇక దీనితో దాదాపు మూడు నెలల తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అనుమతులు లేకుండా స్వేచ్ఛగా రాకపోకలు సాగిపోతున్నాయి.

ఇకపోతే ఇప్పటికే వేరే రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ చెక్ పోస్టులను ఎత్తి వేస్తున్న సంగతి విధితమే.ఇది ఈ నిర్ణయంతో రేపటినుంచి ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు జోరు అందుకోబోతున్నాయి.

ఇక మరోవైపు APSRTC కూడా రేపటి నుంచి మరిన్ని బస్సులు రాష్ట్రంలో తిరిగేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతునట్లు తెలుస్తోంది.కాకపోతే యధా విధంగానే సీట్లను పరిమితిగా నుంచి బస్సు సర్వీసులను ఎక్కువగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మే 21 తారీకు నుంచి తిరుగుతున్న బస్సుల ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 29 కోట్ల పైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలియజేస్తున్నారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బస్సులు 49 శాతం ఆక్యుపెన్సీ తో నడుస్తుండగా, ఆన్లైన్ లో మాత్రం బుకింగ్ 32 శాతానికి చేరినట్లు అధికారులు తెలియజేస్తున్నారు.

ఏది ఏమైనా కరోనా తక్కువ ఉన్నప్పుడు మాత్రం కాస్త కఠిన నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాలు ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఇలా చేయడం ఎంతవరకు సబబో ప్రభుత్వానికే తెలియాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube