లవ్ స్టోరీ వాయిదా అంటూ జోరుగా ప్రచారం.. నిజమేంటంటే..?

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లవ్ స్టోరీ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.లవ్ స్టోరీ సినిమా నిర్మాతలు కొన్ని నెలల క్రితమే ఏప్రిల్ 16వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

 No Change In Nagachaitanya Love Story Movie Release Date , Love Story, Nagachait-TeluguStop.com

అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.రిలీజ్ డేట్ వాయిదా ప్రచారం వల్ల నాగచైతన్య, సాయిపల్లవి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

అయితే వైరల్ అవుతున్న ఫేక్ వార్తల గురించి లవ్ స్టోరీ చిత్ర యూనిట్ స్పందించి స్పష్టతనిచ్చింది.లవ్ స్టోరీ రిలీజ్ డేట్ కు సంబంధించి ప్రేక్షకులకు ఎలాంటి సందేహం అవసరం లేదని.

సినిమాను ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ ప్రకారం ఏప్రిల్ 16వ తేదీన విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.ఈ నెల 16వ తేదీన లవ్ స్టోరీ సినిమాను రిలీజ్ చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది.

Telugu April, Love Story, Mahesh Babu, Nagachaitanya, Change, Sai Pallavi, Saman

ఈ సినిమాలోని సారంగదరియా పాట యూట్యూబ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఫిదా తరువాత సాయిపల్లవికి లవ్ స్టోరీ సినిమా అదే స్థాయిలో మంచి పేరు తెచ్చిపెడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఒక వర్గం ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చైతన్య కెరీర్ లోనే ఎక్కువ మొత్తం బిజినెస్ చేయడం గమనార్హం.ఈ సినిమా పాటలు మహేష్ బాబు, సమంత చేతుల మీదుగా విడుదల కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

మజిలీ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్న నాగచైతన్యకు వెంకీ మామ రూపంలో ఝలక్ తగలగా ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని చైతన్య భావిస్తున్నారు.ఫిదా తరువాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube