ఇలాంటి ఏటీఎం దొంగతనంను మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు  

No Chance To See This Type Of Atm Robbers-

మనం ప్రతి రోజు చిత్ర విచిత్రమైన దొంగతనాలు చూసి ఉంటాం. పిల్లల చేతిలో చాక్లెట్స్‌ ఎత్తుకు వెళ్లడం, పెద్ద వారి చేతిలో డబ్బు ఎత్తుకు వెళ్లడం, ఏటీఎంల నుండి డబ్బు దోచుకు పోవడం, బ్యాంకులో దూరి బంగారం విలువైన వస్తువులు ఎత్తుకు వెళ్లడం వంటివి చేస్తూ ఉండగా మనం చూశాం, మీడియాలో ఎప్పుడు కథనాలు చూస్తూనే ఉంటాం. కాని నేను ఇప్పుడు చెప్పబోతున్న దొంగతనం మీరు ఆ వీడియో చూస్తే తప్ప నమ్మలేరు..

ఇలాంటి ఏటీఎం దొంగతనంను మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు-No Chance To See This Type Of ATM Robbers

ఇంత దారుణమైన దొంగతనం కూడా ఉంటుందా అని వెంటనే ఎక్కడ జరిగిందా అంటూ ఆసక్తి కలుగుతుంది.

ఇంతకు జరిగిన దొంగతనం ఏంటో తెలుసా… ఏటీఎం చోరి, ప్రపంచంలో ప్రతి రోజు ఏదో ఒక మూల ఏటీఎం దొంగతనం జరుగుతూనే ఉంది. అయితే ఈ ఏటీఎం చోరి చాలా ప్రత్యేకం. రోడ్డు పక్కన ఉన్న ఏటీఎం సెంటర్‌ ముందుకు ఒక భారీ ప్రొక్లెన్‌ వచ్చి ఆగింది.

ఎందుకో అని అనుకున్నారు. అయితే ఆ ప్రొక్లెన్‌తో ఏటీఎం ఉన్న రూంను బద్దలు కొట్టి, పునాదితో సహా ఏటీఎం మిషన్‌ను పెగిలించాడు. ఏటీఎం మిషన్‌ను తీసి, తమతో తీసుకు వచ్చిన ఒక వ్యాన్‌లో వేశారు.

ఆ వ్యాన్‌లో వేసుకుని అక్కడ నుండి ఉడాయించారు.

ఐర్లాండ్‌లో చోటు చేసుకున్న ఈ విచిత్రమైన దొంగతనం అత్యంత చిత్రమైనదిగా గుర్తింపు దక్కించుకుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ ఏటీఎం చోరి కూడా ఇలా జరగలేదు అంటూ అంతా చెప్పుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత వింతైన ఏటీఎం చోరిగా దీన్ని రికార్డుల్లో కూడా నమోదు చేసే అవకాశం ఉంది.

ఇంత దొంగతనం జరుగుతుంటే స్థానికులు ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారంటూ సోషల్‌ మీడియా జనాలు విస్తు పోతున్నారు.