ఇక సినిమాలలో నెగిటివ్ పోలీస్ రోల్స్ ఉండవు… పోలీస్ అంటే హీరోనే  

no chance to negative police roles in movies in feature, Tollywood, Telugu Cinema, Police Stories - Telugu No Chance To Negative Police Roles In Movies In Feature, Police Stories, Telugu Cinema, Tollywood

సినిమా కథల విషయంలో ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కీలకమైన సవరణలు చేసింది.ఇండియన్ ఆర్మీ మీద ఇకపై సినిమాలు తీయాలంటే రక్షణ శాఖ అనుమతులు తప్పనిసరి చేసింది.

TeluguStop.com - No Chance To Negative Police Roles In Movies In Feature

Source:TeluguStop.com

అలాగే ఇండియన్ ఆర్మీని నెగిటివ్ గా చూపించే సినిమాలకి అనుమతులు లభించవని కరాఖండీగా చెప్పేసింది.వాటికి సెన్సార్ పర్మిషన్ కూడా ఉండవని స్పష్టం చేసింది.

TeluguStop.com - ఇక సినిమాలలో నెగిటివ్ పోలీస్ రోల్స్ ఉండవు… పోలీస్ అంటే హీరోనే-Movie-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మరో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది.కేవలం ఇండియన్ ఆర్మీ మీదనే కాకుండా ఇండియన్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద సినిమాలు తీసినప్పుడు కూడా కచ్చితంగా ఆయా రాష్ట్రాల హోం శాఖ నుంచి కచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సిందే అని స్పష్టం చేసింది.

అదే సమయంలో పోలీసులకి కేవలం హీరోలుగా మాత్రమే చూపించాలని, విలన్ లు గా చూపించే ప్రయత్నం చేయకూడదని, అలా చేసిన సినిమాలు రిలీజ్ కి అనుమతులు ఇవ్వబదవని తెలియజేశారు.

పోలీసుల నుంచి ఎలాంటి నెగిటివ్ సన్నివేశాలు చిత్రీకరించాలి అనుకున్న నో అబ్జక్షన్ కచ్చితంగా తీసుకోవాల్సిందే.

అలా చూపించడానికి బలమైన కారణాలు కూడా చెప్పాలి.ఈ నిబంధనలు కేవలం సినిమాలకు మాత్రమే కాకుండా సీరియల్స్, వెబ్ సిరీస్ లకి కూడా వర్తిస్తుందని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.

అనుమతులు లేకుండా పోలీసులని నెగిటివ్ గా చిత్రీకరించి సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్ లు రిలీజ్ చేస్తే ఇకపై క్రిమినల్ కేసులు నమోదు అవుతుందని ఆ ఆదేశాలలో పేర్కొన్నారు.ఈ నిబంధనల వలన ఇకపై సినిమాలు శైలి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.

పోలీసులని హీరోలుగా చిత్రీకరించాలన్న కథలో భాగంగా గతంలో ఒక అవినీతి పోలీస్ పాత్రలు ఉండేవి.అయితే ఇప్పుడు అలాంటి పాత్రలకి అవకాశం లేదు.

దీంతో కథలు చెప్పే విధానం పూర్తిగా మార్చుకోవాల్సిందే.దేశ రక్షణ, శాంతిభద్రతల విషయంలో బాద్యతలు నిర్వహిస్తున్న వారిని సినిమాలలో తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఈ కొత్త నిబంధనలని కేంద్రం హోం మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది.

ఈ నిబంధనలపై సినీ దర్శకులు ఎలా రియాక్ట్ అవుతారో అనేది చూడాలి.

#Police Stories #NoChance

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

No Chance To Negative Police Roles In Movies In Feature Related Telugu News,Photos/Pics,Images..