నితిన్ క్లెవర్ గేమ్.. పోయినా ఏం కాదట!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ట్రో’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

 No Buzz On Nithiin Maestro-TeluguStop.com

బాలీవుడ్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘అందాధున్’కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నాడు.అయితే ఈ సినిమాపై అనుకున్న స్థాయిలో అంచనాలు లేకపోవడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.

బాలీవుడ్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రాగా, టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తారని చిత్ర యూనిట్ భావిస్తోంది.

 No Buzz On Nithiin Maestro-నితిన్ క్లెవర్ గేమ్.. పోయినా ఏం కాదట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే హిందీలో వచ్చిన అందాధున్ చిత్రాన్ని మెజారిటీ తెలుగు ఆడియెన్స్ ఓటీటీలో చూశారు.

దీంతో మాస్ట్రో చిత్రంలో కొత్తదనం ఏమీ ఉండదని ప్రేక్షకులు ఓ నిర్ణయానికి వచ్చేశారు.అంతేగాక మాస్ట్రో చిత్రానికి సంబంధించిన టీజర్, సాంగ్స్ కూడా అంతంతమాత్రంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడం వెనుక కూడా ఇదే కారణమని తెలుస్తోంది.నితిన్ కూడా ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల కోసమే తీసినట్లు ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది.

ఏదేమైనా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి ఉంటే గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని భావించే, ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తు్న్నారని తెలుస్తోంది.

ఇటీవల నాని నటించిన ‘టక్ జగదీష్’ కూడా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యింది.

ఈ సినిమా రిజల్ట్‌ను ముందే ఊహించిన నిర్మాతలు నేరుగా ఓటీటీ రిలీజ్‌కు చొరవ చూపారని టాక్ వినిపిస్తుంది.ఇప్పుడు నితిన్ కూడా ఇలాంటి క్లెవర్ గేమ్ ఆడటంతో నిర్మాతలు ఎలాంటి భయం లేకుండా ఉన్నారు.

ఆల్రెడీ వారు పెట్టిన డబ్బులు ఓటీటీ ద్వారా రాబట్టారు.ఇక మాస్ట్రో సినిమా ఓటీటీలో ప్రేక్షకులను మెప్పించినా, మెప్పించలేకపోయినా తమకు ఒరిగేది ఏమీ లేదని వారు ధీమాగా ఉన్నారు.

మరి నితిన్ మాస్ట్రో చిత్రంలో ఏమాత్రం సత్తా లేకపోవడంతోనే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారా అనేది తెలియాలంటే సెప్టెంబర్ 17 వరకు వెయిట్ చేయాల్సిందే.

#Tamannaah #Maestro #Nithiin #Nabha Natesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు