టాలీవుడ్‌లో విభిన్న కథలతో తెరకెక్కే సినిమాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తాడు యంగ్ హీరో శ్రీవిష్ణు.ఆయన నటించే సినిమాల్లో ఖచ్చితంగా ఆకట్టుకునే అంశం ఏదో ఒకటి ఉంటుందని ప్రేక్షకుల ప్రగాఢ నమ్మకం.అందుకే ఆయన సినిమాలు చూసేందుకు జనం ఇష్టపడుతుంటారు.ఇక తాజాగా శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం రాజ రాజ చోర.సినిమా టైటిల్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ సినిమాలో కథ కూడా ఆసక్తికరంగా ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారు.
అయితే ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాలో శ్రీవిష్ణు మార్క్ కంటెంట్ ఉండకపోవచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఇక అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలోని పాటలు కూడా సోసోగా ఉండటం ఈ సినిమాపై మరింత డిజపాయింట్‌మెంట్‌ను క్రియేట్ చేశాయి.అయితే శ్రీవిష్ణు యాక్టింగ్‌కు మాత్రం పేరు పెట్టే పనిలేదని, ఈ సినిమాలో ఏదో ఒక అంశంలో ఆయన యాక్టింగ్ లెవెల్ ఈ సినిమాకు బాగా కలిసొస్తుందని కొంతమంది ఆయన అభిమానులు అంటున్నారు.
మరి రాజ రాజ చోర అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తప్ప ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఏదీ కూడా ఇంట్రెస్టింగ్‌గా లేకపోవడం ప్రేక్షకులను నిరుత్సాహానికి గురిచేస్తోంది.
ఇక రిలీజ్ కూడా దగ్గరపడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.
ఈ సినిమాను హసిత్ గోలి డైరెక్ట్ చేస్తుండగా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాలో అందాల భామలు మేఘా ఆకాష్, సునైనా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.
మరి రాజ రాజ చోర చిత్రంతో హీరో శ్రీవిష్ణు ఎలాంటి రిజల్ట్‌ను దక్కించుకుంటాడో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే ఆగస్టు 19 వరకు వెయిట్ చేయాల్సిందే.